Movies

సెలబ్రెటీ షాకింగ్ కామెంట్స్ తో షేక్ అవుతున్న అరవింద సమేత…. షాక్ లో NTR

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామిబినేషన్ లో తొలిసారి వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మూవీకి మంచి టాక్ వచ్చిందని అంటున్నారు.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కావడంతో వసూళ్ల పంట పండుతోందట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జగపతి బాబు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గల విలన్ గా నటించాడు. తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తున్న ఈ సినిమా ఈ దసరా సీజన్ కి మేటి చిత్రంగా నిలవబోతోందని అంటున్నారు. పైగా పెదదగా సినిమాలు కూడా పోటీలేవు. ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.

ఓవరాల్ గా అందరి దృష్టి పడిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం గురించి రచయిత, దర్శకుడు కోన వెంకట్ స్పందిస్తూ అరవింద సమేత బ్లాక్ బస్టర్ అని ప్రకటిస్తూ ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ ఫాన్స్ కి నిజంగా ఈ సినిమా నిజంగా పండగేనని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు కూడా అరవింద సమేత వీర రాఘవ చిత్రం మంచి హిట్ అయిందని తెగ సంబరపడిపోతున్నాడు.

ఇక స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన ఫామిలీ తో సినిమా చూసి స్పందిస్తూ, ప్రతి సీను ఎంతో అందంగా తెరకెక్కించారని ,ముఖ్యంగా సినిమా మొత్తం తన ఫెరఫార్మెన్స్ తో మా బాద్ షా అదరగొట్టాడని కితాబిచ్చాడు. ఈమేరకు ట్వీట్ చేసారు. మరో డైరెక్టర్ గోపీచంద్ మలినేని స్పందిస్తూ ఎన్టీఆర్ కెరీర్ లో ఇది బెస్ట్ మూవీ అని ప్రశంసించాడు. ఇక కథ చెప్పడం ఎలాగో త్రివిక్రమ్ సినివాస్ కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదన్నారు. తమన్ అద్భుత సంగీతం అందించగా, జగపతి బాబు విలన్ గా ఇరగదీశాడని పేర్కొన్నాడు.

తారక్ బెస్ట్ ఫ్రెండ్ మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ,’అరవింద సమేత వీర రాఘవ’ మూవీ పక్కా బ్లాక్ బస్టర్. కంగ్రాట్స్ టు తారక్’అని పేర్కొన్నాడు. ఇక యువ హీరో నిఖిల్ కూడా ‘అరవింద సమేత వీర రాఘవ’పై తన అభిప్రాయం పంచుకుంటూ,తాను ఏదైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సి వస్తే అది తారక్ దేనని పేర్కొంటూ, అరవింద సమేత వీర రాఘవ బాగా చేసారని ట్వీట్ చేసాడు. నవదీప్, బీవీఎస్ రవి వంటి వాళ్ళు కూడా అరవింద సమేత పై ప్రశంసలు కురిపించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."