Movies

ఆనంద్ సినిమాలో నటించిన రాజా గుర్తు ఉన్నాడా… ఇప్పుడు అవకాశాలు లేక ఏమి చేస్తున్నాడో తెలుసా?

ఒక్కరి కష్టాలు చూస్తే,గుండె తరుక్కుపోతుంది. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటాం. ఇక రంగుల ప్రపంచంలో ఉన్నవాళ్ళ జీవితాల వెనుక విషాదం ఎవరికీ తెలియంది. ఆనంద్ సినిమాతో మంచి నటుడుగా గుర్తింపు పొందిన రాజా జీవితం కూడా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోనే ఉంది. సినిమాల్లో గల పోటీ ఇతనికి ఛాన్స్ లు లేకుండా చేసింది. ఒకప్పడు బాగా సంపాదించే ఉద్యోగం వదిలి,సినిమాలో చేరిన రాజా ఇపుడు ఏదో చిన్నపాటి ఉద్యోగంతో నెట్టుకొస్తున్నాడు. నిజానికి చిన్ననాటి నుంచి ఇతనికి కష్టాలే ఎదురయ్యాయి. ఓసారి వివరాల్లోకి వెళ్తే,..
విశాఖ పట్నానికి చెందిన రాజా కు ఇద్దరు అక్కలు.

తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరుకుటుంబాల పెద్దలు వీళ్ళను దూరంగా పెట్టేసారు. రాజాకు 8ఏళ్ళ వయస్సులో తల్లి ఊపిరితిత్తుల కాన్సర్ తో మరణించారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తండ్రి వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లి కొంతకాలానికి తిరిగివచ్చేసారు. అలా వచ్చిన ఏడాదికే తండ్రి మరణించడంతో ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అప్పటికి రాజాకు 14ఏళ్ళు. తండ్రి మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిన రాజా పురుగుల మందు తాగేసి,ఆత్మహత్యకు యత్నించాడు.

ఫ్రెండ్స్ విషయం గమనించి హాస్పిటల్ లో చేర్చడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఆతర్వాత పార్టీ టైం ఉద్యోగం చేస్తూ డిగ్రీ చేసిన రాజా,ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. నిజానికి 3500మంది ఆ ఉద్యోగానికి పోటీపడితే,కేవలం నలుగురు ఎంపికయ్యారు. అందులో రాజా ఒకడు. మొదట్లో శిక్షణలో 40వేలు,ఆతర్వాత ఉద్యోగం లో చేరాక 60వేలు నెలకు సంపాదన రావడంతో కష్టాలు గట్టెక్కాయి. అక్క పెళ్లి చేయడంతో పాటు డబ్బు కూడా బానే కూడబెట్టాడు.

అప్పుడు ఎప్పటినుంచో సినిమాల్లో చేరాలనే కోరిక బయటపడింది. దీంతో రెండున్నరేళ్లుగా చేస్తున్న ఉద్యోగం కాస్తా వదిలేసి, అమెరికా వెళ్లి,నటనలో శిక్షణ పొంది వచ్చాడు. సర్టిఫికెట్స్ పట్టుకుని,కాళ్లరిగేలా తిరిగినా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇక లాభం లేదనుకుని,ముంబయి వెళ్లి మోడలింగ్ వైపు ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు. సరిగ్గా అప్పుడే డాక్టర్ డి రామానాయుడు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో, సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. ఓ చిన్నదానా మూవీతో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన రాజాకు,అనూహ్యంగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఆనంద్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఆ సినిమాతో అతడికి మంచి బ్రేక్ వచ్చింది. అయితే ఆతరువాత పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక పోటీపోటీగా నటులు రావడంతో ఛాన్స్ లు కూడా తగ్గిపోయాయి. బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వచ్చిన రాజాకు మళ్ళీ ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. చిన్న ఉద్యోగం చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు. పాపం రాజా అని అందరూ అనడమే గానీ, సినీ ఛాన్స్ లు ఇవ్వడం లేదు.