ఈ స్టార్ హీరోల క్లాస్ మేట్స్ కూడా టాప్ స్టార్ హీరోలు… వారి మీద ఒక లుక్ వేయండి
బాల్యం అపురూపమైనది అంటారు. కల్లా కపటం లేని జీవితం అది. ఆడుతూ పాడుతూ సరదాగా గడిచిపోయినా బాల్యం తిరిగిరానిది. అయితే చిన్నప్పుడు మనతో కల్సి చదువుకున్న వాళ్ళు అనుకోకుండా తారసపడితే ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోతాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టునీడలో అంటూ చదువుకున్న రోజులను తలచుకుంటూ ఆనందంతో మురిసిపోతాం. అలాంటింది మనతో చదువుకున్నవాళ్ళు పెద్దయ్యాక స్టార్స్ గా వెలుగొందుతుంటే,మరీ ఆనందం కదా. అలా ఇండస్ట్రీలో చిన్నప్పటి ఫ్రెండ్స్ పెద్దయ్యాక హీరోలుగా, యాక్టర్లుగా, దర్శకులుగా, పరస్పరం నటులుగునా వెలుగొందుతూన్న వాళ్ళను ఒకసారి పరిశీలిస్తే పెద్ద జాబితాయే ఉంటుంది.
అయితే అందులో కొందరి గురించి తెల్సుకుందాం.హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి,హీరో డాక్టర్ రాజశేఖర్ ని పెళ్లిచేసుకున్న జీవిత మంచి ,డైరెక్టర్ గా కూడా పేరుతెచ్చుకున్నారు. ఈమె , ప్రముఖ డైరెక్టర్ తేజ కూడా చిన్నప్పుడు కల్సి చదువుకున్నారు. వీరి స్నేహం ఇప్పుడు కూడా రెండు కుటుంబాల స్నేహంగా వెలుగొందుతోంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ,మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో కల్సి చదువుకున్నారు. వీళ్ళు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నా సరే,వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ , మంచు మనోజ్ కూడా ఒకే స్కూల్ లో కల్సి చదువుకున్నారు. ఇద్దరి మధ్యా ఫ్రెండ్ షిప్ అలానే వుంది.
ఇద్దరూ సినీ పరిశ్రమలో హీరోలే.వైస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్,హీరో నాగార్జున మేనల్లుడు సుమంత్ వీరిద్దరూ క్లాస్ మేట్స్. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ రంగాన్ని ఏలుతున్న వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న వాళ్లే. వాళ్ళు ఎవరంటే, రానా,రామ్ చరణ్,శర్వానంద్ లు. వీరు ముగ్గురూ ఒకే క్లాస్ లో చదువుకున్నారు. ఇక రామ్ చరణ్,శర్వానంద్ కల్సి అప్పట్లో ఓ కాఫీ షాప్ కూడా పెట్టారని భోగట్టా.
హైదరాబాద్ ఎస్సార్ నగర్ శ్రీ చైతన్య కాలేజీలో హీరో నాని, యాంకర్ ప్రదీప్ కల్సి చదువుకున్నారు. అయితే ఒకే క్లాస్ లో వీళ్ళు చదుకున్నా సరే,వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ లేదట. అయితే ఇండస్టీకి వచ్చాక మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ , మురళీమోహన్ కల్సి గుంటూరులో చేరుకున్నారు. ఇద్దరి మధ్యా మంచి ఫ్రెండ్ షిప్ వుంది. వీళ్ళిద్దరూ ఎంపీలుగా గెలుగుపొందడం విశేషం.
1989లో ఏలూరు నుంచి కృష్ణ కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలవగా, 2014లో రాజమండ్రి నుంచి టిడిపి తరపున పోటీ చేసి గెల్చిన మురళీమోహన్ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.ఇక చివరిగా చూస్తే, తెలుగులో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు స్టడీ మద్రాస్ లోనే జరగడంతో సెయింట్ మీడియన్ ఆంగ్లో సెకండరీ హైస్కూల్ లో చదుకునేటప్పుడు తమిళ హీరోలు సూర్య,కార్తీక్ కూడా అక్కడే చదివారు. కార్తీ అయితే మహేష్ కి క్లాస్ మేట్ కూడా.
అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా మహేష్ బాబుకి క్లాస్ మేట్ కావడం మరో విశేషం. ఇక డిగ్రీ సమయంలో తమిళ్ సూపర్ స్టార్ విజయ్,మహేష్ ఇద్దరూ మద్రాస్ లయోలా కాలేజీలో క్లాస్ మేట్స్.