Movies

కలల రాకుమారుడు అరవింద్ స్వామి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా?

సినిమావాళ్ళకు కష్టాలు ఏమీ ఉంటాయి అనుకుంటాం. కానీ మామూలు జనం లాగే వాళ్లకు కష్టాలు,పుట్టెడు దుఃఖం ఉంటాయి. రోజా సినిమాలో తన నటనతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి ని ఎన్నో కష్టాలు వెంటాడాయి. డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన అతడు తనకు తానుగా సినిమాల నుంచి దూరమై,తెరమరుగయ్యారు. బరువు కూడా పెరిగిపోయాడు. అసలు విషయాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెట్టి కామెడీ చేసారని అరవింద్ స్వామి ఆవేదన చెందాడు. అరవింద్ ఎందుకలా అయ్యాడో ఒకసారి వివరాల్లోకి వెళ్తే,మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన రోజా, ఆతరువాత బొంబాయి సినిమాలు ఓ ఊపు ఊపేసాయి. అరవింద్ స్వామికి అభిమానులను తెచ్చిపెట్టిన సినిమాలు అవి.

నిజానికి అరవింద్ స్వామి అప్పట్లో అమ్మాయిలకు కలల రాకుమారుడు. అయితే అరవింద్ రోజా సినిమా తర్వాత ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించకుండానే స్టడీ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఇక సినిమాల జోలికి వెళ్లకూడదని అనుకున్నాడట. అయితే అతని తల్లికి అనారోగ్యం కారణంగా ఇండియాకు వచ్చిన అరవింద్,ఆరుమాసాలు ఇక్కడే ఉండి, తల్లిని కంటికి రెప్పలా కాపాడుకున్నా, మృత్యువు ఆమెను తీసుకుపోయింది.

ఇక కొంతకాలానికి తండ్రి కూడా మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ బాధనుంచి తప్పించుకోడానికి మణిరత్నం సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. తండ్రి మరణంతో కుటుంబ,వ్యాపారాలను నిర్వహించాల్సి రావడంతో సఖి మూవీ తర్వాత ఇక సినిమాలు వద్దనుకున్నాడు. మరోపక్క భార్యతో విడాకులు రావడం,పిల్లల బాధ్యత కూడా తానె తీసుకోవడం వలన బిజీ అయిపోయాడు.

ఇక కొన్నాళ్ల తరువాత తీవ్రమైన వెన్ను నొప్పి కూడా రావడంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇక అదేసమయంలో పక్షవాతం కూడా తాకింది. ఏడాది పాటు మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో 110కిలోల బరువు పెరిగాడు. ఓరోజు తన కూతురు దగ్గర ఓ మహిళ తన గురించి అవమానకరంగా మాట్లాడిందని,ఇక మణిరత్నం కడలి సినిమాకోసం ఆఫర్ ఇవ్వడంతో బరువు తగ్గడం మొదలుపెట్టానని,ఆతర్వాత మామూలు రూపానికి వచ్చానని అరవింద్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.