Devotional

విజయదశమి పండుగను అక్టోబర్ 18 లేదా 19…. ఏ రోజు జరుపుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి.

ఈ సంవత్సరం దసరా పండుగను 18 వ తేదీన జరుపుకోవాలా లేక 19 వ తేదీన జరుపుకోవాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే కొన్ని క్యాలెండర్స్ లో 18 అని కొన్ని క్యాలెండర్స్ లో 19 అని ఉంది. అసలు దశమి పండుగను ఏ రోజు జరుపుకోవాలో అనేది తిధి,నక్షత్రంను బట్టి పండితులు నిర్ణయిస్తారు. అక్టోబర్ 18 మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాల నుండి దశమి ఘడియలు ప్రారంభం అవుతాయి. 19 వ తారీఖు 4 గంటల వరకు దశమి ఘడియలు ఉన్నాయి. అందువల్ల అందరు దసరా 19 వ తారీఖు అని అనుకుంటున్నారు.

అయితే ప్రామాణిక గ్రంధాల ప్రకారం దసరా పండుగను శ్రావణ నక్షత్రం,దశమి తిధి ఉన్న రోజు జరుపుకోవాలని పండితులు చెప్పుతున్నారు. శ్రావణ నక్షత్రం 18 వ తారీఖు రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు ఉంది. 19 వ తారీఖు అస్లు శ్రావణ నక్షత్రం లేదు. ఈ లెక్కన చూస్తే దసరా పండుగను 18 వ తారీఖునే చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు శ్రావణ నక్షత్రం,దశమి తిధి రెండు ఉన్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ గుడిలో కూడా 18 వ తారీఖునే దసరా పండుగను చేస్తున్నారు.

శ్రావణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. ఎవరైనా కొత్త పనులను దసరా రోజున ప్రారంభిస్తే విజయవంతం అవుతాయి. అలాగే దసరా రోజు జెమ్మి జుట్టును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. జెమ్మి చెట్టును సువర్ణ వృక్షం అని అంటారు. జెమ్మి చెట్టుకు పూజ చేసాక ఆ ఆకులను ఇంటిలో డబ్బు భద్రపరిచే బీరువాలో పెడితే ధన వృద్ధి కలుగుతుంది.

ఈ శమీ పత్రాలను దసరా రోజుల్లో అమ్మవారికి పూజ చేస్తే పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది. రాముడు రావణాసురుడి మీద విజయం సాధించింది దసరా రోజునే. కాబట్టి విజయదశమి పండుగను శ్రావణ నక్షత్రం,దశమి తిధి ఉన్న 18 వ తారీఖున జరుపుకుంటేనే అన్ని విధాలా మంచి జరుగుతుంది.