Movies

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గురించి తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం. అయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలుసుకుందాం. అయన సినీ ప్రస్థానం ఎలా మొదలైందో వంటి విషయాలను తెలుసుకుందాం.

1. త్రివిక్రమ్ పూర్తి పేరు “ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ”. భీమవరం ఆయన సొంత ఊరు.

2. న్యూక్లియర్ ఫిజిక్స్ లో msc పూర్తి చేసి. ఆంధ్ర యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ అందుకున్నారు

3. సిరివెన్నెల గారి మేనకోడలు అయిన “సౌజన్య” గారిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం

4. dnr కాలేజీ లో చదువుతన్న రోజుల నుండి సునీల్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. సినిమా రంగంలో కష్టాలు పడుతున్న కొత్తలో ఇద్దరు రూమ్ మేట్స్!

5. కెరీర్ మొదట్లో “పోసాని” గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసారు త్రివిక్రమ్. కమెడియన్ గౌతమ్ రాజు గారి పిల్లలకి ట్యూషన్ కూడా చెప్పారు!

6. ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ రాసిన సినిమా “నిన్నే ప్రేమిస్తా.” డైలాగ్స్ రాసింది “స్వయంవరం”. కానీ స్వయంవరం కంటే ముందే “నువ్వే కావాలి” విడుదల అయ్యింది.

7. బెస్ట్ డైలాగ్ రైటర్ గా అయిదు సార్లు నంది అవార్డు అందుకున్నారు త్రివిక్రమ్. అతడు, అత్తారింటికి దారేది సినిమాలకు ఫిలిం ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు.

8. ఒక రాజు ఒక రాణి, తీన్మార్ సినిమాల్లో పాటలు కూడా రాసారు త్రివిక్రమ్. అంతేకాదు “నువ్వే నువ్వే” లో “కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్” పాటలో ఓ బిట్ కూడా పాడారు.

9. రామ్ చరణ్, ధోని తో పెప్సీ యాడ్స్, ఎన్టీఆర్ నవరత్న యాడ్, మహేష్ బాబు జొస్ అలుకాస్ యాడ్, తమన్నా, కోహ్లీ సెల్కొన్ యాడ్స్ కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసారు.

10. ఆరు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసి టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ లో త్రివిక్రమ్ స్థానం సంపాదించుకున్నారు

11. అతడు సినిమా తెలుగు, హిందీ, మలయాళం లోనే కాదు పోలిష్ భాషలో కూడా డబ్ అయ్యింది.

12. జల్సా ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ 40 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదే ఇప్పటివరకు హైయెస్ట్