Movies

అరవింద సమేత’ సినిమాలో తారక్ నాయనమ్మ ఎవరో తెలుసా? ఆమె కొడుకు స్టార్ హీరో…?

ఓ సినిమా హిట్ అయినా,ఫట్ అయినా అందుకు పూర్తి బాధ్యత గతంలో డైరెక్టర్స్,నిర్మాతలకు ఉండేది. రానురాను హీరోయిజం పెరగడంతో సీను మారిపోయింది. అయినా ఇప్పటికీ కొందరు డైరెక్టర్లు తమదైన ముద్ర వేస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు తనదైన బాణీలో సినిమాలపై ముద్ర వేస్తున్నారు. ఇక రాజమౌళి అయితే ఇక చెప్పక్కర్లేదు. తాజాగా వచ్చిన దసరా సినిమా అరవింద సమేత మూవీకి త్రివిక్రమ్ డైరెక్షన్ చేయగా, ఆయన కాంబినేషన్ లో ఎన్టీఆర్ తొలిసారి నటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కలెక్షన్స్ రికార్డు బద్దలు కొడుతోంది.

ఇక ఏ సినిమా చూసినా, మన తెలుగువాళ్ళ కన్నా ఇతర భాషా నటీనటులు మన తెలుగులో దూసుకుపోతున్నారు. అదే విధంగా ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కొత్తగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అరవింద సమేతలో హీరో ఎన్టీఆర్ కి నాయనమ్మ గా నటించి, జేజీ అనిపిలిపించుకున్న మోస్ట్ టాలెంటెడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ సుప్రియా పాథక్ మంచి నటన కనబరిచింది.

నిజానికి ఈమెది గుజరాత్. ఈమెకు చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉండడంతో వెన్నతో పెట్టిన విద్య గా నటన మారింది. డిగ్రీ చదివే రోజుల్లో మంచి స్టేజ్ ఫెరఫార్మెన్స్ లు ఇచ్చి మంచి నటిగా రాణించింది. అది చూసిన ఓ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. 1981లో మహాభారతం స్పూర్తితో తీసిన కలియుద్ తో వెండితెరపై మెరిసింది. సుభద్ర పాత్రకు బెస్ట్ ఫిలిం ఫెర్ అవార్డు అందుకుంది.

ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా రాణించింది.విజేత,బాజార్,మాన్సూన్,గాంధీజీ బయోపిక్ వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించింది.బుల్లి తెరపై కూడా ఎన్నో పాత్రలు వేసి ఆకట్టుకుంది.ఇక ఈమె తండ్రి ఒకప్పుడు రాజేష్ ఖన్నా,దిలీప్ కుమార్ వంటివారికి డ్రెస్ మేకర్ . ఆమె అక్క రత్నా పాథక్ కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్.

బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించడమే కాకుండా,హాలీవుడ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. సుప్రియా ఒకప్పుడు మంచి నటుడు అయిన పంకజ్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈయనకు ఈమె రెండవ భార్య. పంకజ్ కపూర్ కొడుకు షాహిద్ కాపూర్ స్టార్ హీరో కావడం విశేషం. అందుకే షాహిద్ కి సుప్రియా పిన్ని అవుతుంది.

పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా జరిగిన సుప్రియా,మళ్ళీ 11ఏళ్ళ తర్వాత రామ్ గోపాల్ వర్మ సర్కార్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అమితాబ్ భార్య పాత్ర,తల్లి పాత్రలో జీవించింది. రామలీల డైరెక్షన్ లో లేడీ డాన్ పాత్ర వేసి, సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు అరవింద సమేతలో బామ్మగా నటించి అందరినీ ఆకట్టుకుంది.