టాలీవుడ్ లో ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో మంచి స్నేహితులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్
వీరిద్దరూ కలిసి జల్సా,అత్తారింటికి దారేది సినిమాలు చేసారు. ఈ రెండు సినిమాలు డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి భావాలు కలవటంతో ఎక్కువగా ఇద్దరూ కలిసే కనపడుతూ ఉంటారు.
ఎన్టీఆర్ -రాజీవ్ కనకాల
వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులంటే ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రాజీవ్ కి చిన్న పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.
ప్రభాస్ – గోపీచంద్
వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.
నయనతార -త్రిష
ఇద్దరి నటీమణుల మధ్య స్నేహం ఉండటం అనేది అరుదుగా కనపడుతుంది. అయితే వీరు ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్ళుతూ ఉంటారు.
శివాజీ రాజా – శ్రీకాంత్
వీరిద్దరూ స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా నవ్వులు పుయిస్తారు. వీరు చాలా మంచి స్నేహితులు.
నితిన్ – అఖిల్
ఈ యువ హీరోల మధ్య స్నేహం ఎంత గొప్పది అంటే, నితిన్ అఖిల్ సినిమా కోసం నిర్మాతగా మారాడు.
రానా,అల్లు అర్జున్,రామ్ చరణ్
రానా,రామ్ చరణ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు. చరణ్ బందువు అయిన బన్ని కూడా రానా కి మంచి స్నేహితుడు అయ్యాడు. ఈ విధంగా వీరు ముగ్గురు టాలీవుడ్ లో మంచి స్నేహితులు అయ్యారు.
నాగార్జున – అనుష్క
యోగ టిచర్ అయిన అనుష్కను నాగార్జున ‘సూపర్’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఇప్పుడు ఆమె పెద్ద స్టార్ గా మారింది. ప్రస్తుతం అనుష్క నాగార్జున ఏ సాయం అడిగినా చేయటానికి సిద్దంగా ఉంటుంది.
సమంతా – నీరజ
వీరిద్దరూ చిన్నతనం నుండి మంచి స్నేహితులు. నీరజ సమంతాకి మేకప్ చేయటంలో బాగా సహాయం చేస్తుంది.
తాప్సి – మంచు లక్ష్మి
మంచు లక్ష్మి ‘జుమ్మంది నాదం’ సినిమా ద్వారా తాప్సి ని పరిచయం చేసింది. అప్పటి నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.