Politics

పొట్టి శ్రీరాములు గారి దీక్ష గురించిన విషయాలు

1952 అక్టోబరు 19వ తేదీన తన దీక్ష ప్రారంభించారు. అయన దీక్ష విరమించటానికి రెండు షరతులను చెప్పారు. దీక్ష సమయంలో పొట్టి శ్రీరాములు గారు ఏ విధమైన ఆహారం తీసుకున్నారు. దీక్ష సమయంలో మొదటి రోజు పొట్టి శ్రీరాములు గారు ఎన్ని కిలోల బరువు ఉన్నారు. దీక్ష 58 వ రోజున ఎన్ని కిలోల బరువు ఉన్నారో వివరంగా తెలుస్కుందాం.

ప్రతిరోజూ నాలుగు నిమ్మకాయల రసం, రెండు చెంచాల ఉప్పు, రెండు చిటికెల సోడా టైకార్బొనేట్, రెండు ఔన్సుల తేనె తీసుకునేవారు.

దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆయన్ను వైద్య బృందం పరీక్షించి, ఆ వివరాలను నమోదు చేసేది. శ్రీరాములు బరువు ఇలా తగ్గుతూ వచ్చింది.

మొదటి రోజు – 53.9 కేజీలు, 10వ రోజు – 48.5 కేజీలు, 26వ రోజు – 45.8 కేజీలు, 43వ రోజు – 42.6 కేజీలు, 58వ రోజు – 38.1 కేజీలు.