Movies

జూనియర్ ఎన్టీఆర్ ని బెల్ట్ తో చితకబాదిసిన తల్లి .. ఎందుకలా చేసినట్టు ?

కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత బ్యాక్ గ్రౌండ్ వున్నా, అతనిపట్ల వ్యతిరేకత కూడా నందమూరి కుటుంబంలో ఉండేది. దీనిపై గతంలో చాలానే వార్తలు వచ్చాయి. హరికృష్ణ రెండో భార్య షాలిని పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో తన జీవితానికి మార్గ నిర్దేశం చేసింది తన తల్లేనని చెప్పొకొచ్చాడు. మంచి , చెడు అన్నీ దగ్గరుండి చెప్పేదని, జీవితంలో గుర్తింపు గల ఏదో పని చేసి నిన్ను నీవు నిరూపించుకోవాలని చెప్పేదని, అందుకే ఆత్మవిశ్వాసం పెరిగిందని తారక్ ఓ ఇంటర్యూలో చెప్పాడు. ఇటీవల హరికృష్ణ మరణంతో కుంగిపోయిన తను తేరుకుని తల్లిని ఓదార్చడంలో దృష్టి పెట్టాడు. ఇప్పుడిప్పుడే ఆ కుటుంబం విషాదం నుంచి కోలుకొంటోంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ని తల్లి షాలిని బెల్ట్ తో చితకబాదేసి ఆతర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇంతకీ ఎప్పుడు అనే విషయంలోకి వెళ్తే,చిన్నపుడు ఎన్టీఆర్ చాలా అల్లరి చేసేవాడు. ఫ్రెండ్స్ తో క్రికెట్,సినిమాలు, షికారులు ఇలా చాలా విసిగించేవాడు. దీంతో ఆమె తట్టుకోలేక బెల్ట్ తో కొట్టేసేవారట. అలా దెబ్బలు తిన్న ఎన్టీఆర్ గుళ్లో ఒంటరిగా దాక్కునేవాడట. ఆతర్వాత అతని తల్లి అతని వెతుక్కుంటూ వెళ్లి తీసుకొచ్చేవారట. బెల్ట్ తో కొట్టినందుకు కంటతడి పెట్టి భోరున విలపించేవారట.

ఇక పెద్దయ్యాక నటుడిగా ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు తారక్. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి తరపున ప్రచారం చేసి వస్తున్న ఎన్టీఆర్ 2009 మార్చి 26న ఊహించలేనంతగా ఘోర ప్రమాదానికి గురయ్యాడు. ఒళ్ళంతా రక్తమై, ఎముకలు ఎక్కడెక్కడో విరిగినట్లు అనిపించడం వలన సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందాడు.

అయితే తల్లి దీవెన,అభిమానుల అండదండల వలన ప్రాణాపాయం నుంచి ఎన్టీఆర్ బయటపడ్డాడు. అందుకే తనకు అమ్మంటే చాలాప్రేమని ఎన్టీఆర్ చెబుతుంటాడు. మదర్స్ డే ని కేవలం ఓ రోజు కాకుండా రోజూ జరుపుకుంటామని చెబుతుంటాడు. అప్పటినుంచి ఎన్టీఆర్ ఆలోచనలో మార్పు వచ్చిందని అంటారు. ఎందుకంటే, ఇది పునర్జన్మ అని అందరూ అనడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.

అయితే 2014లో సోదరుడు జానకిరామ్ కారు ప్రమాదంలో దుర్మరణం కావడంతో మళ్ళీ తట్టుకోలేని బాధను అనుభవించాడు. ఇక ఇటీవల తండ్రి హరికృష్ణ కూడా కారుప్రమాదంలో చనిపోవడంతో ఊహించని దెబ్బ తగిలింది. మొత్తానికి కుటుంబ ప్రమాదాలు ఎన్టీఆర్ కి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయని అంటున్నారు.