Movies

రామ్ చరణ్ కి నో చెప్పేసిన టాప్ హీరోయిన్…షాక్ లో రామ్ చరణ్… ఆలా ఎందుకు చేసిందో తెలుసా?

సినిమాల్లో ఛాన్స్ లు ఎలా వస్తాయో ఎలా పోతాయో,కొన్నింటిని ఎలా వదులుకుంటారా, కొన్ని వస్తే ఎగిరి గంతేసి ఎలా చేస్తారో చెప్పలేం. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే జయమాలిని,జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత,అనురాధ,అభినశ్రీ,డిస్కో శాంతి ఇలా కొంతమంది ఉండేవారు. రానురాను హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్ లకు ఎగబడిపోతున్నారు. సినిమా అంతా కష్టపడి చేస్తే,వచ్చేదానికన్నా ఓ ఐటెం సాంగ్ చేస్తే చాలు అన్నట్లుగా వ్యవహారం తయారైంది.

నాలుగు డబ్బులు వెనకేసుకోడానికి కూడా ఐటెం సాంగ్ చేస్తే చాలు అనే ధోరణీ వచ్చేసింది. అందుకే స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్ లకోసం ఎగబడ్తున్నారు. ఛాన్స్ వస్తే అసలు వదులుకోవడం లేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఐటెం సాంగ్ వస్తే వదిలేసిందట. పైగా రామ్ చరణ్ మూవీలో నట. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయి, ఫిలిం నగర్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముకుందా, ఒక లైలా కోసం, బాలీవుడ్ లో మొహంజదారో వంటి మూవీస్ లో నటించినా రాని గుర్తింపు పూజా హెగ్డే కు ఒకే ఒక ఐటెం సాంగ్ తో వచ్చేసింది.

రంగస్థలం మూవీలో జిగేల్ రాణి సాంగ్ కి పూజా చేసిన డాన్స్ కుర్రకారుని హోరెత్తించింది.అంతకు ముందెన్నడూ రాని గుర్తింపు ఈ ఒక్క పాటతో పూజకు వచ్చేసింది. కాగా రామ్ చరణ్ సరసన దృవ,బ్రూస్ లీ మూవీస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రత్యేక గుర్తింపు ఏమీ రాలేదు. అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించే ‘వినయ విధేయ రామ’ అనే తాజా చిత్రంలో ఐటెం సాంగ్ చేయాలని ఆఫర్ వచ్చిందట.

నిజానికి స్పైడర్ తరవాత తెలుగులో ఛాన్స్ లు తగ్గిపోయిన రకుల్ గతంలో బోయపాటి శ్రీను నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్ లో వచ్చిన జై జానకీ నాయక మూవీలో అలాగే సరైనోడు మూవీస్ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈవిధంగా చెర్రీకి, బోయపాటికి కూడా రకుల్ మంచి ఫ్రెండ్. అందుకే ఐటెం సాంగ్ చేయమని అడిగారట. అయితే కోలీవుడ్ లో బిజీగా ఉన్నానని,తాను నటించలేనని సున్నితంగా తిరస్కరించిందట. ఇప్పుడు ఈ అంశం వైరల్ అయి, జోరుగా చర్చ నడుస్తోంది.