మా టివిలో వచ్చే కార్తిక దీపం సీరియల్ లో అత్తగారు సౌందర్య భర్త ఎవ్వరో తెలిస్తే షాకవుతారు
సినిమాలలో ఎంతపేరు వస్తుందో బుల్లితెరమీద అంతకు రెట్టింపు పేరు వచ్చేస్తుంది. జనం నోళ్ళల్లో ఆయా పాత్రల పేర్లు నానుతాయి. ఒక్క రోజు సీరియల్ మానేస్తే, ఏదో కోల్పోయినంతగా ఫీలయ్యేవాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే సీరియల్స్ కి అంతగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఇందులో యాక్ట్ చేయడానికి కూడా చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మా టివి, ఈటివి, జెమిని,జిటివి ఇలా ఎన్నో చానల్స్ లో సీరియల్స్ ధారావాహికంగా ప్రసారం అవుతున్నాయి.
ముఖ్యంగా మాటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో సూపర్ హిట్ సీరియల్ గా కార్తీక దీపం నిలిచింది. ఈ సీరియల్ లో కార్తీక్ తల్లి పాత్ర సౌందర్య రోల్. ఈ పాత్ర పోషిస్తున్న వ్యక్తి హీరోయిన్ కంటే ఏమాత్రం తక్కువ కాదని చెప్పవచ్చు. అందం,అభినయం,డైలాగ్ డెలివరీ,ఎక్స్ ప్రెషెన్స్ అన్నింటినీ తన నటనలో చూపిస్తూ అందరినీ ఆకట్టుకునే పాత్ర ఇది. సౌందర్య పాత్రలో ఇంతలా కట్టిపడేస్తున్న ఈమె పేరు అర్చన.
ఈమె భర్త పేరు అనంత్. అందుచేత ఈమె పేరు అర్చన అనంత్. సొందర్య కేరక్టర్ కోసం ఎంతోమందిని పరిశీలించాక అర్చనను ఎంపిక చేశారట.
అర్చన కేరళలోనే పుట్టి పెరిగింది. కార్తీక దీపం సీరియల్ షూటింగ్ కోసం ఈమె హైదరాబాద్ కి మకాం మార్చింది. మలయాళీ అయినప్పటికీ తమిళం,కన్నడం,కొద్దిగా తెలుగు కూడా వచ్చు.
ఈమెకు ఓ చిన్నారి బాబు ఉన్నాడు. మొదట్లో సీరియల్స్ బానే చేసినా , ఆతరవాత ఆఫ్ స్క్రీన్ లో సినిమాలు,సీరియల్స్ ప్రొడ్యూస్ చేయడంపై దృష్టి పెట్టింది. ఆతరవాత కొన్నాళ్లకు కో ఎంప్లాయి అనంత్ ని ప్రేమించి పెళ్లాడింది. అతడు తమిళియన్. ఇద్దరిదీ కులాంతర వివాహం. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు.