Movies

స్వర్ణ కమలం సినిమాలో భానుప్రియ అక్కగా నటించిన ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

కళాతపస్వి కె విశ్వనాధ్ సినిమా అనగానే దానికో ప్రత్యేకత ఉంటుంది. కళాత్మక విలువలు, సంగీత, సాహిత్య,నృత్య విభాగాల మేళవింపు వుంటుంది. అదేకోవలో స్వర్ణ కమలం మూవీ విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చి, బంపర్ హిట్ అయింది. వెంకటేష్ , భానుప్రియ నటించిన ఈ చిత్రంలో చాలామంది నటీనటులు వేశారు. భానుప్రియ తండ్రి వేదపండితుడు. ఇక ఆమె అక్క పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రలో దేవిలలిత నటించింది. తెలుగు సరిగ్గా రాకపోయినా తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించి అందరి మన్ననలు అందుకుంది.

చెన్నైలోని కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన దేవిలలిత సినిమాల మీద మక్కువతో వెండితెరమీదికి అడుగుపెట్టిన ఈమె 1986లో తమిళంలో శివాజీ గణేశన్, లక్ష్మి నటించిన అనంత కన్నీరు అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. 1987లో మలయాళంలో ముమ్ముట్టి సరసన హీరోయిన్ గా నటించింది. వెనువెంటనే స్వర్ణకమలంలో ఛాన్స్ దక్కించుకుంది. భానుప్రియ అక్క కేరక్టర్ లో అదరగొట్టేసింది. వేదపండితుడు, అయితే కళ్లుకూడా లేని తండ్రి బాధ్యతలు చూసుకుంటూ,చెల్లెకి ఎలా ఉండాలో తెలియజెప్పే పాత్రలో దేవిలలిత లీనమై నటించింది.

ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాలో దేవిలలిత నటించి అభిమానులను అలరించింది. ఇక ఆతర్వాత తెలుగులో ఆమె కనిపించలేదు. 1990లో తమిళంలో ఆనంద్ తో కల్సి నటించింది. ఇక పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఆనాటి నుంచి ఫామిలీ మెంబర్స్ తో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. అయితే స్వర్ణ కమలం మూవీలో ఎంత అందంగా ఒద్దిగ్గా ఉన్నారో ఇప్పుడు కూడా ఆమె అలానే ఉన్నారని చూసినవాళ్లు చెప్పేమాట.