Movies

శేఖర్ కమ్ముల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి… భార్య ఎంత పెద్ద సంస్థను నడుపుతుందో తెలుసా?నమ్మలేని నిజాలు

హింస, అస్లీలత చాలా తక్కువమోతాదులో ఉండే సినిమాలు ఎవరివి అని అడిగితె,వెంటనే శేఖర్ కమ్ముల పేరు చెబుతారు. ఎందుకంటే, వినోదంతో పాటు,సందేశం కూడా ఈయన సినిమాల్లో ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడతగ్గ రీతిలో ఈయన సినిమాలుంటాయి. ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా మారాడు. కొత్తవాళ్లు,పాతవాళ్ళు ఇలా ఎవరితో సినిమా చేసినా సక్సెస్ అందుకోవడం శేఖర్ కమ్ముల గొప్పతనం. తెలుగు సినిమా రంగంలో కొత్త ట్రెండ్ ఈయన సృష్టించారు. అవార్డులు అందుకున్నారు. నిర్మాతగా, రచయితగా కూడా రాణిస్తున్న ఈ యువ దర్శకుడు పనితనానికి ఆనంద్ ,హ్యాపీ డేస్,గోదావరి,లీడర్ , ఫిదా సినిమాలు తార్కాణాలు.

1972ఫిబ్రవరి 4న హైదరాబాద్ లో జన్మించిన శేఖర్ కమ్ముల సినిమాల్లో చేరి, తీసిన సినిమాలకు గాను 6నంది పురస్కారాలు అందుకున్నారు. సికింద్రాబాద్ సెయింట్ ఫోడ్రిక్స్ హైస్కూల్ లో టెన్త్ క్లాస్ పూర్తిచేసి, సెయింట్ ఆల్ఫా కాలేజీ నుంచి ఇంటర్ పూర్తిచేసాడు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన శేఖర్ అమెరికాలోని కంప్యూటర్ కోర్సులో పిజి కోసం వెళ్ళాడు. కొంతకాలం ఐటి రంగంలో పైనించేసాడు.

వాషింగ్టన్ లోని హోవడ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరాడు. దర్శకునిగా తొలిచిత్రం డాలర్ డ్రీమ్స్ నుంచి ఉత్తమ నూతన దర్శకునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇక శేఖర్ డైరెక్ట్ చేసిన ఆనంద్ సినిమా కమర్షియల్ విజయాన్ని నమోదుచేసింది. ప్రతి ఫ్రేమ్ లోని తనదైన ముద్ర ఉంటుంది. డాలర్ డ్రీమ్స్ సినిమాలో అమెరికాలో అతడు పడిన కష్టాలను చూపించాడు. సినిమా హిట్ అవ్వలేదు. పైగా ఉచితంగా వేసినా ఎవరూ చూడలేదు. సినిమాలకు డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో అతని కుటుంబమే అతని అండగా నిల్చింది.

శేఖర్ కమ్ముల భార్య శ్రీవిద్య కూడా భర్తకు అండగా ఉంటుంది. తండ్రి శేషయ్య, తల్లి,భార్య పిల్లలల్తో ఉమ్మడిగా శేఖర్ కమ్ముల నివసిస్తున్నాడు. కుటుంబ బాధ్యత నిర్వహిస్తూ శేఖర్ పై ఎలాంటి వత్తిడి లేకుండా భార్య చూసుకుంటోంది. పెద్దగా అవసరం ఉంటె తప్ప బయటకు రాదు. అత్తమామలు, ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటుంది. అమేగా అనే కంపెనీ బాధ్యతల్ని కూడా ఆమె నిర్వహిస్తోంది. శేఖర్ కి చంద్రశేఖర్ అనే తమ్ముడున్నాడు.

యితడు కూడా ఉన్నత చదువులు చదివి అమెరికాలో సెటిల్ అయ్యాడు. అన్నపై ఉన్న నమ్మకంతో కష్టపడ్డ సొమ్ముని అతని సినిమాలకు చంద్రశేఖర్ ఫైనాన్స్ చేసాడు. చంద్రశేఖర్ ప్రొడక్షన్స్ పై డాలర్ డ్రీమ్స్,ఆనంద్,ఆవకాయ్ బిర్యానీ,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే నాలుగు సినిమాలు తీసాడు. అమేగా ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా ఈ సినిమాలు నిర్మాతమయ్యాయి.