Movies

హీరో వెంకటేష్ భార్య నీరజ కుటుంబం గురించి మీకు తెలియని నిజాలు

ప్రముఖ నిర్మాత రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేష్ తన కుటుంబం గురించి ఎక్కడ మాట్లాడడు. అలాగే వెంకటేష్ భార్య గురించి గాని పిల్లల గురించి గాని పెద్దగా విషయాలు కూడా బయటకు రావు. అలాగే పబ్లిక్ ఫంక్షన్ లకు కూడా పెద్దగా హాజరు కారు. అలాగే వెంకటేష్ భార్య గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. వెంకటేష్ పెళ్లి కోసం రామానాయుడు సంబంధాలు చూసినప్పుడు డబ్బు,కులం పట్టింపు లేకుండా అమ్మయి గుణగణాలకే ప్రాముఖ్యతను ఇచ్చి చాలా సంబంధాలను చూశారట. Venkatesh And Neerajaఆ సమయంలో టాలీవుడ్ దిగ్గజం నాగిరెడ్డి గారు ఒక సంబంధం చెప్పారట. నాగిరెడ్డి గారి బంధువు మదనపల్లె కు చెందిన సుబ్బారెడ్డి గారమ్మాయి నీరజ గురించి రామానాయుడుకి చెప్పారట. ఆ సంబంధం రామానాయుడు,వెంకటేష్ లకు నచ్చటంతో 13 డిసెంబర్ 1987 న నీరజను వివాహం చేసుకున్నారు వెంకటేష్. 
చెన్నైలో విజయ శేషమహల్ లో వెంకటేష్,నీరజల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి సినీ,వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరు అయ్యి దంపతులను ఆశీర్వదించారు. ఇక నీరజ తండ్రి సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇప్పటికి నీరజ తల్లిగారు వ్యాపారాన్ని చూసుకుంటారు. జేవితం ఆనందంగా ఉండాలంటే డబ్బు,హోదా కంటే పద్దతి,అణుకువ ఉండాలని అర్ధం చేసుకున్న రామానాయుడు వెంకటేష్ కి నీరజను ఇచ్చి వివాహం చేసారు. రామానాయుడు తీసుకున్న నిర్ణయం వందకు వంద శాతం కరెక్ట్ అని వెంకటేష్ దంపతులు నిరూపించారు. Venkatesh Family