Politics

తమ్ముడు రామ్మూర్తి నాయుడు గురించి చంద్రబాబు ఆవేదన ఎందుకో తెలుసా?

దేశంలో ప్రస్తుతం ఉన్న రాజయకీయ నాయకుల్లో పరిపాలన అనుభవం , కష్టపడి సాధించే తత్త్వం గల నాయకుడు ఎవరంటే, ఠక్కున ఎపి సీఎం చంద్రబాబు పేరు చెబుతారు. చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు చెందిన చంద్రబాబు విద్యార్థి దశనుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. ఈయనకు రామ్మూర్తి నాయుడు అనే తమ్ముడు ఉన్నారు. గతంలో 9ఏళ్ళు అధికారంలో గల చంద్రబాబు ప్రతిపక్షంలో 10ఏళ్ళు వ్యవహరించి ప్రజల మధ్య నిత్యం గడిపేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. నిధుల కొరత ఉన్నా సరే,రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు.

దేశంలోనే కాదు విదేశాల్లో సైతం చంద్రబాబుకి ఇమేజ్ వుంది. ఆయా దేశాల అధినేతలు చంద్రబాబుని కలుస్తూ ఉంటారు. ఇక ఐక్య రాజ్య సమితిలో కూడా మాట్లాడే ఛాన్స్ ఈయనకు దక్కింది. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడంలో చంద్రబాబు దిట్ట. వీలు చిక్కిన్నపుడు సొంతూరు నారావారి పల్లెకు వెళ్లి అందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎక్కువ స్థాయిలో తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. అమరావతి రాజధానిని ఇంటర్ నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దే పనిలో పడ్డారు.

ఇక చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రామ్మూర్తి ఆతర్వాత ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఈయన ఒక దశలో చంద్రబాబుని కూడా వ్యతిరేకించారు. కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదని రామ్మూర్తి నాయుడు అలిగి,తన నియోజక వర్గంలో బిక్షాటన చేయడం అప్పట్లో సంచలనం కల్గించింది.

అయితే అనూహ్య రీతిలో ఆరోగ్యం దెబ్బతినడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయిన రామ్మూర్తి నాయుడు కి భార్య ఇందిర, కొడుకు నారా రోహిత్ ఉన్నారు. రోహిత్ సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. తమ్ముడు అనారోగ్యం పాలవ్వడంతో అతని కుటుంబ బాధ్యతలను చంద్రబాబు తలకెత్తుకున్నారట. సొంతూరు వెళ్ళినపుడు తమ్ముడిని పలకరించి వస్తారట. ఆరోగ్యంగా ఉండివుంటే తనకు అండగా ఉంటూ సహకరించేవాడని చంద్రబాబు అనుకుంటూ ఉంటారు.