Devotional

కార్తీక మాసంలో చేయవలసిన,చేయకూడని పనులను తెలుసుకొని ఆచరిస్తే పుణ్యం అంతా మీదే… మరి చూడండి

కార్తీక మాసం అనేది తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి,విష్ణువుని పూజిస్తారు. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైనదే. ప్రతి సంవత్సరం కార్తీక మాసం దీపావళి మరుసటి రోజు నుండి ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో తెల్లవారుజామున తలస్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. ఈ మస్మాలో ఏమి చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో దానాలు ఇవ్వటం వలన పుణ్యం కలుగుతుంది. అయితే కార్తీక మాసంలో చేయవలసిన పనులు,చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే పుణ్యం అంతా మీదే.

చేయవలసిన పనులు

ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు,జపాలు,దానాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ప్రతి రోజు కుదరని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున తలస్నానము చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం అయ్యాక భోజనం చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుందని పురాణాలూ చెపుతున్నాయి.

చేయకూడని పనులు

కార్తీక మాసంలో ఉల్లి,వెల్లుల్లి,మాంసం.మద్యం జోలికి అసలు వెళ్ళకూడదు.
పాపపు ఆలోచనలు చేయకూడదు. ఎవరికి ద్రోహం చేయకూడదు. దైవ దూషణ చేయకూడదు.
కార్తీక మాసంలో దీపారాధన చేసినప్పుడు నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించాలి.
మినుములు తినకూడదు.
కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.