Movies

మాతృ దేవో భవ చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారు… ఏ రంగంలో సెటిల్ అయ్యారు

అమ్మ మీద చాలా సినిమాలు వచ్చాయి. తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ, వెలుగు నిచ్చేది అమ్మ అని అంటారు. అయితే అమ్మ పడే ఆవేదన ను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ అప్పట్లో మాధవి నటించిన మాతృదేవో భవ మూవీ జనం కంట తడి పెట్టించింది. 1993లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కూడా టివిలో వస్తోంటే జనం చూస్తూ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. అంతలా ఆకట్టుకున్న ఈ సినిమాలో పాటలు కూడా సూపర్బ్. తాను కాన్సర్ కి గురవ్వడంతో ఇక పిల్లలను చూసే వాళ్ళు ఎవరూ ఉండరని భావించి వాళ్ళను దత్తతకు పంపే మాతృమూర్తిగా మాధవి తన నటనతో రక్తికట్టించారు. ఇక కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే తండ్రి పాత్రలో నాజర్ మెప్పించాడు.

ఈ సినిమాలో మాధవి,నాజర్ కి నలుగురు పిల్లలుంటారు. బేబీ సీన,మాస్టర్ మార్టిన్,మాస్టర్ ఫణి,మాస్టర్ తేజ పిల్లల పాత్రలతో ఒదిగిపోయారు. ఇక ఈ సినిమా తమిళంలో అక్షధూత పేరుతొ వచ్చింది. ఇక ఈ సినిమా వచ్చి పాతికేళ్ళు అయింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. అయితే వాళ్ళు ఎలా వున్నారో ఎక్కడున్నారో ఒకసారి తెలుసుకుందాం.

ముందుగా రాధ పాత్రలతో నటించి బేబీ సీన గురించి ప్రస్తావిస్తే,తమిళంలో అనేక టివి సీరియల్స్ లో , సినిమాల్లో నటించి సీనా ఆంటోని గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో హిట్ అయిన హిట్లర్ ని రీమేక్ చేయగా అందులో హీరో ముమ్మిట్టి చెల్లెలుగా సీనా నటించింది. సీరియల్స్ లో బిజీ గా ఉన్న సీనా, జాన్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. వీరికి ఓ పాప ఉంది.

చివరి వరకు తల్లితోనే ఉండే పాత్రలో ఉండి,కన్నీరు పెట్టించిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మార్టిన్ ని తీసుకుంటే,అప్పట్లో మూడవ తరగతి చదివేవాడు. దీనితరువాత మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. మాతృదేవో భవ తమిళ మాతృకలో కూడా నటించాడు. మద్రాస్ లయోలా కాలేజీలో ఇంజనీరింగ్ చదివి,సెటిల్ అయ్యాడు. 2017లో పెళ్లి చేసుకున్నాడు. అయితే హీరోలను మించి అందం ఉన్నా సరే తనకు నటన మీద ఆసక్తి లేదని స్పష్టం చేసాడు. ఇక పాలు తాగే పసిపిల్లాడుగా నటించిన తేజ, మరో పాత్రలో నటించిన మాస్టర్ ఫణి,వీళ్ళిద్దరూ ఎక్కడా మళ్ళీ సినీ ఛాయలకు రాలేదు.