Movies

సినిమాల్లో మన హీరో,హీరోయిన్స్ వేసుకొనే బట్టలను సినిమా అయ్యిపోయాక ఏమి చేస్తారో తెలుసా?

సినిమాల్లో స్టార్స్ వేసుకున్న బట్టలంటే అభిమానులకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. మార్కెట్ లో వచ్చిన కొత్త డిజైన్ వారు వేసుకుంటేనే క్రేజ్ పెరుగుతుంది. ప్రస్తుతం హీరోలు కూడా ట్రెండ్ సెట్ చేయాలనే ఉద్దేశంతో ఉండటం వలన ట్రెండీ దుస్తులు వేసుకొని వాటికీ క్రేజ్ తీసుకువస్తున్నారు. అప్పట్లో కన్నాంబ లోలాకులు,వాణిశ్రీ చీర కట్టు బొట్టు అన్ని ఫాలో అయ్యిపోయేవారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే మీడియం రేంజ్ హీరో కూడా ఒక్కో సినిమాకి 10 లక్షలకు పైనే బట్టలకు ఖర్చు పెట్టిస్తున్నారు. 
అదే స్టార్ హీరో అయితే దాదాపుగా 30 నుంచి 40 లక్షల వరకు బట్టలకు ఖర్చు చేస్తున్నారు. దాంతో నిర్మాతలు హీరోలతో బట్టల కోసం ప్యాకేజిలు మాట్లాడేసుకుంటున్నారు. డిజైనర్స్ కి బడ్జెట్ చెప్పేసి ఆ లోపే అయ్యిపోవాలని చెప్పుతున్నారు. డిజైనర్స్ ఫారెన్ నుంచి బ్రాండ్స్ తెప్పించి మారాయి డిజైన్ చేస్తున్నారు.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే… కాజల్ కి అయితే కేవలం ఒక సినిమాకి 35 నుంచి 40 లక్షల వరకు బట్టలకే ఖర్చు అవుతుంది. సరే సినిమా కోసం ఇన్ని లక్షలు పెట్టి బట్టలు కొంటున్నారు కదా. సినిమా అయ్యిపోయాక ఈ బట్టలని ఏమి చేస్తారో తెలుసా? కొంత మంది నిర్మాతలు గోడౌన్ లో పాడేస్తారు. మరి కొంత మంది నిర్మాతలు సెకండ్స్ లో అమ్మేస్తారు. 50 లక్షల బట్టలను 5 లక్షలకు అమ్మిన సందర్భాలు చాలానే ఉంటాయి. కొందరు సినిమా కాస్ట్యూమ్స్ వారు కొనుక్కొని సినిమాలో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ లకి అద్దెకి ఇస్తూ ఉంటారు. ఇక పెద్ద పెద్ద జాకెట్స్,షూ వంటి వాటిని ముంబైలో సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మేస్తూ ఉంటారు. హీరోయిన్స్ చీరలు అయినా అంతే. ఒకవేళ ఏదైనా డ్రెస్ నచ్చితే ఇంటికి తీసుకువెళ్లిపోతారు. హీరోయిన్స్ చీరలు,నగలు,చెప్పులు అన్ని వేలంలో అమ్మేస్తారు.ఒకవేళ పెద్ద నిర్మాత అయి ఉండి తరచుగా సినిమాలు తీస్తూ ఉంటె మాత్రం గోడౌన్ లో దాచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఉపయోగిస్తూ ఉంటారు. అదే టివిలో వచ్చే సీరియల్స్ విషయానికి వస్తే ఎవరి బట్టలు వారే తెచ్చుకోవాలి. ముందుగానే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వారు చెప్పుతారు.