జబర్దస్త్ లో స్క్రిప్ట్స్ రాసే స్థాయి నుండి కోట్లు తీసుకుంటున్న ప్రసన్న కుమార్ గురించి తెలుసా?
గన్ను కంటే పెన్ను పవర్ గొప్పదని గతంలో ఎక్కువగా వినిపించే మాట. కానీ ఇప్పుడు,పెన్ను కి ఎంత పవరుంటే అంతగా రాణించవచ్చని,కోట్లు గడించవచ్చని అంటున్నారు. అయితే రచయితలు చాలామంది ఉన్నా,సక్సెస్ అయ్యేది కొందరే. అలా సక్సెస్ అయిన వాళ్లలో రైటర్ ప్రసన్న కుమార్ ఒకడు. అవును మరి,ఒకప్పుడు జబర్దస్త్ లో స్క్రిప్ట్స్ రాస్తూ ఇప్పుడు సినిమాలకు కథ అందించడం ద్వారా కోట్లు గడిస్తున్నాడు స్క్రిప్ట్ రైటర్ ప్రసన్న కుమార్. ఇక డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ పెంచాలని రైటర్స్ భావించడం సహజమే. నిజానికి ఇలాంటి దమ్మున్న రైటర్స్ కోసం డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ వెతుకుతూ ఉంటారు.
అలాంటి దమ్మున్న రైటర్ కనుకనే ప్రసన్న కుమార్ ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తెలుగు టివి రంగంలో ఓ ఊపు ఊపేస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం లో స్కిట్స్ కి రచయితగా మాటలు అందించిన ఇతనికి సినిమాల్లోనూ ఛాన్స్ లు వస్తున్నాయి. సినిమా చూపిస్తా మావా మూవీతో హిట్ టాక్ అందుకున్న ప్రసన్నకుమార్ ఆతర్వాత త్రినాధరావు నక్కిన ‘నేను లోకల్’,హలొ గురు ప్రేమకోసమే చిత్రాలకు మాటలు అందించి,మంచి హిట్ అందుకున్నాడు. దీంతో ఇతడిపై అంచనాలు పెరిగిపోయాయి.
తాజాగా వెంకటేష్ తో త్రినాధరావు ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి కథ,మాటలు అందించేది ప్రసన్న కుమార్. మొదట్లో మాటల మాంత్రికుడు ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటే, ఆతర్వాత కోన వెంకట్ కూడా అదే రేంజ్ లో తీసుకున్నాడట. ఇక ప్రసన్న కుమార్ కి కూడా కోటి రూపాయల ఆఫర్ వచ్చింది.
త్రినాధరావు నాలుగు కోట్లు తీసుకుని అందులో కోటి రూపాయలు ప్రసన్న కుమార్ కి ఇస్తున్నాడట. ఇటీవల డైరెక్షన్ పై కూడా దృష్టి పెట్టిన ప్రసన్న కుమార్, ఈమేరకు హీరో రాజ్ తరుణ్ తో చర్చలు జరపడం, వెంటనే ఆ హీరో ఒకే చెప్పడం జరిగిందట. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారట. ఇక వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి వుంది.