Movies

అనుష్క అన్నయ్యల గురించి మీకు ఈ విషయాలు తెలుసా? నమ్మలేని నిజాలు

బెంగుళూరులోని ఓ స్కూల్ లో యోగ పాఠాలు చెప్పే బ్యూటీ స్వీటీ అనుష్క అనూహ్యంగా సినిమాల్లో అడుగుపెట్టి అగ్రతార అయింది. పేరుకి కన్నడ భామ అయినా తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతోంది . బాహుబలి మూవీతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. టాప్ హీరోల సరసన నటించడమే కాదు,లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తనదైన ముద్రవేసిన అనుష్క సౌత్ ఇండియాలోనే అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోంది. పూరి జగన్నాధ్ తీసిన సూపర్ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుష్క కి గల గ్లామర్,అభినయం ఆమెను అగ్ర స్థాయి హీరోయిన్ గా చేర్చింది.

తన ఎదుగుదలకు తండ్రి విఠల్,తల్లి ప్రఫుల్లా,సోదరులు గుణ రంజన్,సాయి రమేష్ లు ఎంతగానో ప్రోత్సాహం అందించారని అనుష్క చెబుతుంది. ఆమెను కుటుంబమంతా కంటికి రెప్పలా చూసుకుంటుంది. అనుష్క అంటే వారికి పంచప్రాణాలు. అరుంధతి,మిర్చి,బాహుబలి సినిమాలతో ఓ స్టార్ హీరోకి గల ఇమేజ్ ని అనుష్క సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆమెకు గల ఫాన్స్ ఫాలోయింగ్ కూడా పీక్స్ కి చేరింది.

నిజానికి ఓ యోగా టీచర్ సినిమాల్లోకి రావడమే కాదు,అనూహ్యంగా స్టార్ డమ్ అందుకోవడం నిజంగా ఓ అద్భుతం. రుద్రమదేవిలో ఆమె నటనకు జనం బ్రహ్మరధం పట్టారు. అనుష్క తో కల్సి ప్రతీ షూటింగ్ కి గుణ రంజన్ వచ్చేవాడు. దీంతో సినీ పరిశ్రమతో అతడికి కూడా అనుబంధం ఏర్పడింది. ఎన్నో వ్యాపారాలు చూసుకుంటూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన గుణ మరోపక్క అనుష్క కెరీర్ ని కూడా తీర్చిదిద్దాడు.

కర్ణాటకలో న్యూస్ ఛానల్ తో పాటు,వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నాడట. ఇక అనుష్కకు వరుణ్ణి వెదికే బాధ్యతలు కూడా గుణ తీసుకున్నారట. మరో సోదరుడు సాయిరమేష్ బెంగుళూరులో కాస్మొటిక్ సర్జన్ గా పేరుపొందారు. ఇంట్లో అందరికన్నా చిన్నది కావడంతో అందరూ అనుష్కను గారాబంగా చూసుకుంటారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."