Politics

KCR ప్లస్ లు మైనస్ లు ఏమిటో చూద్దాం

వ్యూహంలో దిట్ట, భాషమీద పట్టుగల తెలంగాణా సీఎం కేసీఆర్ తన ముందస్తు ప్రణాళికతో తెలంగాణకు ముందస్తుగానే ఎన్నికలు తెచ్చేసారు. ఇంకా ఆరునెలల సమయం ఉండగానే ఎన్నికలకు సిద్ధం చేసారు. అయితే నాలుగురాళ్లపాటు ఆయన సాగించిన పాలన మళ్ళీ గెలుపు వైపు నడిపిస్తుందని, పగ్గాలు వస్తాయని టిఆర్ ఎస్ శ్రేణులు ఆశతో ఉన్నాయి. అయితే కేసీఆర్ ని ఓడించడానికి టిడిపి అధినేత, ఏపీసీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టారు. మహాకూటమి పేరిట కాంగ్రెస్ , టీడీపీ,సిపిఐ,టిజెఎస్ పార్టీలు జతకట్టాయి. చంద్రబాబు ఎన్నికల వ్యూహం ముందు కేసీఆర్ ఆగుతారా లేదా అనే దానిపై జోరుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు,బెట్టింగులు కూడా ఊపందుకున్నాయి.

అయితే కెసిఆర్ మాత్రం గెలుపు తమదేనన్న ధీమాతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆయన తనయుడు కేటీఆర్,మేనల్లుడు హరీష్ రావు,కూతురు కవిత ఇలా అందరూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇక కేసీఆర్ ఇమేజ్ పెరిగిందా, తగ్గిందా అంటే కొన్ని వర్గాల్లో పెరిగి,మరికొన్ని వర్గాల్లో తగ్గిందని విశ్లేషకులు అంటున్నారు. రైతు బందు పధకం వలన రైతుల్లో ఇమేజ్ పెంచుకున్న కేసీఆర్, పేదలు,వృద్ధుల్లో ఆసరా పెన్షన్ కారణంగా ఇమేజ్ పెరిగిందని అంచనాకొచ్చారు. కల్యాణ లక్ష్మి,ఉచిత గొర్రెల పధకం వలన బిసిల్లో కూడా బలం పెరిగిందని అంటున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదన్న కోపం పేదవర్గాల్లో కనిపిస్తుంటే,, ఉద్యోగాలు రాలేదన్న ఆక్రోశం యువతలో ఉంది. మొత్తం తెలంగాణ ఓటర్ల సంఖ్య 2కోట్ల 80లక్షలు. ఆసరా పెన్షన్లు 42లక్షల మందికి అందుతున్నాయి. ఇది మొత్తం ఓటర్లలో 15శాతం. ఇక ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు. ఇక రైతు బందు,రైతు బీమా, ఉచిత గొర్రెలు ఆసరా పెన్షన్లు కల్పి,కనీసం 10శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నాలుగేళ్లలో బలమైన నేతలు కాంగ్రెస్,టీడీపీ ల నుంచి టిఆర్ ఎస్ లో చేరిపోవడం ఆయా జిల్లాల్లో బలాన్ని పెంచిందని అంటున్నారు. ఇక బిసిల్లో చాలామంది టి ఆర్ ఎస్ కి ఓటు వేస్తారని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఇక టిఆర్ ఎస్ ని బలంగా ఓడించాలన్న కోరిక ప్రజల్లో ఉందా అంటే అనుకున్నంత లేదని కూడా విశ్లేషణ చెబుతోంది. ఎందుకంటే,బలమైన ప్రతిపక్షం బలమైన ఎజెండాతో రావాలి,లేదా ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండాలి. ఈ రెండు కారణాలు కూడా తెలంగాణాలో పెద్దగా కనపడ్డం లేదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ మానిఫెస్టో మీద అద్భుతం అనే విధంగా సమీక్షలు రాలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేలలేదు. అందుకే టీఆరెస్ 75సీట్లతో మళ్ళీ అధికారం పొందడం ఖాయమని అంటున్నారు.

ప్రజకూటమికి 35,బిజెపికి 2,ఎం ఐ ఎం కి 7సీట్లు వస్తాయని ఓ అంచనా ద్వారా తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు ఈసారి ఎన్నికల్లో వస్తాయా అంటే అదీ కనపడ్డం లేదు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్య వాదులు, సెటిలర్స్ లో అప్పుడున్న ఆవేశం ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. పొత్తు వలన ఓట్ల బదిలీ కూడా జరిగే ఛాన్స్ లేదు. 15శాతం ఆంద్ర ఓటర్లు టిడిపి కి అప్పట్లో వేస్తె,ఈసారి ఆపరిస్థితి లేదని అంటున్నారు.
Kcr And Putarekulu
బలమైన నాయకులూ,లబ్ధిపొందిన వాళ్ళు, ఆయా కులాల్లో వచ్చిన మార్పులు ఇలా అన్నీ చూస్తే టిఆర్ ఎస్ మళ్ళీ అధికారం దక్కించుకోవడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగితే ఫలితం మరోలా ఉండొచ్చు.