Politics

ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెన్స్ వెనుక కారణం ఏంటో తెలుసా? .. వచ్చే ఎన్నికల తర్వాత హీరో ..!

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. అందునా ఎపి రాజకీయాలు మరీ ఆశ్చర్యంగా ఉంటాయి. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఎన్నికల్లో టిడిపి మళ్ళీ గెలుస్తుందా లేదా,ఒకవేళ గెలిస్తే చంద్రబాబు తర్వాత ఎవరు ఇలా ఎన్నో ప్రశ్నలు కేడర్ లో నెలకొన్నాయి. అయితే,2009ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారంలో దుమ్మురేపి,ఆతర్వాత సైలెంట్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పైనే దాదాపు అందరి చూపు కనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ కారణంగా లోకేష్ ని లీడర్ గా నిలబెట్టడానికి ఎన్టీఆర్ ని తొక్కిపెట్టారని కూడా ప్రచారం ఉంది.

అయితే ఎంత తొక్కిపెట్టినా, గోడకు కొట్టిన బంతి అంతే వేగంగా వచ్చిన చందంగా సినిమాల్లో హీరోగా మాత్రం తారక్ రోజురోజుకి దూసుకుపోతూ ఫాన్స్ ఫాలోయింగ్ పెంచేకుంటున్నాడు. పైగా చంద్రబాబు వేసే ఎత్తులు,పై ఎత్తులు కూడా తారక్ కి పూర్తిగా అర్ధం అయ్యిపోయాయని,ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా లాభం ఉండదని, సైలెంట్ మెయింటేన్ చేస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు.

నిజానికి నందమూరి కుటుంబంలో చురుగ్గా, తెలివిగా,ధీటుగా వ్యవహరించే గుణం ఎన్టీఆర్ లోనే ఉన్నాయని అందరూ చెప్పే మాట. చంద్రబాబు ఆలోచనలు,వేసే ఎత్తుగడలను తారక్ పసిగట్టాడు. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా లాభం ఉండదని,పైగా చంద్రబాబుని ఎదిరిస్తే,నందమూరి కుటుంబం నుంచి కూడా పెద్దగా సపోర్ట్ రాదని,ఇలాంటి సమయంలో అనవసరంగా లేనిపోనివి కొనితెచ్చుకోవడం ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ మౌనంగానే అన్నీ గమనిస్తున్నట్లు చెబుతున్నారు.

తారక్ లో కనిపించే సైలెన్స్ ధోరణి కూడా చంద్రబాబులో గుబులు రేపుతోందన్న మాటా వినవస్తోంది. ఇక సోదరి సుహాసిని కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్న నేపథ్యంలో తాత తండ్రుల ప్రస్తావన తెస్తూ ట్వీట్ చేసిన ఎన్టీఆర్ ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన తేలేదు. వచ్చే ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా హీరో అవుతాడని,చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ తాతలా పార్టీకి దిక్కు అవుతాడని అంటున్నారు.