హిట్లర్ సినిమాలో హిట్ సాంగ్ ని మెగాస్టార్ కాపీ కొట్టాడా? ఎక్కడ నుండి కాపీ కొట్టారో చూడండి?
డబ్బింగ్ లు, రీమేక్ లు మామూలే. ఇక సినిమాలను కాపీ కొట్టడం రివాజే. హాలీవుడ్ లో వచ్చినవాటిని కాపీకొట్టి టాలీవుడ్,కోలీవుడ్ తదితర భాషల్లో తీస్తుంటారు. ఇక ఇది నా కథని కాపీ కొట్టారంటూ రచ్చకెక్కడం చూస్తూనే ఉన్నాం. అలాగే పాటలను కూడా కాపీ కొట్టడం కూడా వుంది. టాలివుడ్ లో అక్కినేని స్టెప్పులకు శ్రీకారం చుడితే,తర్వాత కాలంలో స్టెప్పులంటే ఇలా ఉండాలని అనిపించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ తరంలో స్టెప్పులేసి హీరోలు చాలామంది వచ్చేసారు.
ఆ రోజుల్లో చిరంజీవి పాటల్లో స్టెప్పులంటే ఫాన్స్ కి మరిచిపోలేని అనుభూతి. ముఖ్యంగా కొన్ని పాటల్లో ఆయన స్టెప్పులు ఫాన్స్ నే కాదు యావత్ జనాన్ని అలరించేవి. అందులో ముఖ్యంగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి ,రంభ జంటగా తెరకెక్కిన హిట్లర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది . ఇందులోని పాటలు సూపర్బ్. కోటి సంగీతం ఆద్యంతం అలరించింది. అందులో ‘నడక కల్సిన నవరాత్రి’పాట అయితే యావత్ సినీ జనాన్ని ఆకట్టుకుంది.
అబీబి,అబీబి అంటూ సాగే ఈ పాటలో మెగాస్టార్ స్టెప్పులకు థియేటర్లో జనం చప్పట్లతో మారుమోగించారు. కొరియోగ్రాఫర్ లారెన్స్ కంపోజ్ చేసిన ఈ పాట బీబీ అనే అరబిక్ పాటను అనుకరించారు. బిబి ఆల్బమ్ 1991లో విడుదలైంది. గొప్ప ఆల్బమ్స్ లో ఒకటిగా నిల్చింది. కాలే అనే గాయకుడు రచించి ఆలపించాడు. 2010ప్రపంచ కప్ పోటీల్లో కాలే ఈ పాటను ఆలపించాడు. నడకకు సొగసులద్ది రూపొందించిన ఈ పాట ను కోటి కంపోజ్ చేసారు. ఈ పాటకు చిరుకి పేరు తెచ్చిన స్టెప్ హిట్లర్ లోనే. ఇక ఆతర్వాత అంతటి స్థాయి పేరుతెచ్చిన స్టెప్ ఇంద్ర మూవీలోని పాట.