Movies

ఎన్టీఆర్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

తెలుగు చిత్ర సీమలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఎన్నో పాత్రల్లో జీవించడమే కాదు, ఏ పాత్ర వేసినా ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ సాటి అనిపించుకున్న మహానటుడు. అది పౌరాణికం కావచ్చు,జానపదం కావచ్చు,సాంఘికం కావచ్చు ఏదైనా సరే నటించి, మెప్పించిన ఘనత ఆయనిది. అయితే డైరెక్షన్ లో కూడా తనదైన శైలి కనబరిచిన ఎన్టీఆర్ ఎన్నో ఆణిముత్యాల వంటి చిత్రాలను అందించారు. అయితే ఎన్టీఆర్ డైరెక్షన్ చేసిన చిత్రాల్లో కొన్ని చిత్రాల్లో ఆయన కొడుకు బాలకృష్ణ నటించారు.

అలా నటించిన సినిమాల్లో 1974లో వచ్చిన తాతమ్మ కల. ఇదే వీరి కాంబినేషన్ లో తొలిమూవీ. ఈ సినిమాతోనే బాలనటుడిగా బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఇక పౌరాణికంగా తీసిన దానవీర సూర కర్ణ రెండవది. మూడవది అక్బర్ సలీం అనార్కలి. నాల్గవది శ్రీ మద్విరాట్ పర్వం. ఐదవది శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. 6వది బ్రహ్మర్షి విశ్వామిత్ర.

హీరోగా ఎంట్రీ ఇచ్చేవరకూ కూడా బాలయ్య ఎన్టీఆర్ తో కల్సి నటించగా ఆవన్నీ మంచి విజయాన్ని నమోదుచేసుకున్నాయి. తండ్రి డైరెక్షన్ లో నటించిన కొడుకుగా టాలీవుడ్ లో రికార్డుకెక్కాడు బాలయ్య.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."