Movies

సుధాకర్ నాయుడుకి మెగాస్టార్ తో గల బంధం ఏంటో తెలుసా?

కొందరు నటులకు సీనియర్ నటులే ఆదర్శం. వారి అభిమానులుగా ఉంటూ వీళ్ళు సినీ రంగ ప్రవేశం చేస్తారు. ఆతరువాత తాము అభిమానించే నటుడితో అనుబంధం కన్నా బంధుత్వం ఉందని తెలిస్తే,అప్పుడు వచ్చే ఆనందం ఊహించలేం. సరిగ్గా ఓ నటుడి విషయంలో ఇదే జరిగింది. అతనెవరో కాదు, విలన్ గా అడుగుపెట్టి,కేరక్టర్ ఆర్టిస్టుగా, మంచి డైరెక్టర్ గా నిలదొక్కుకున్న సుధాకర నాయుడు. అయితే ఈ పేరుచెప్పేకన్నా, విలన్ జివి అంటే అందరికీ అర్ధం అయిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని. అమలాపురంలో పుట్టి పెరిగిన జివి తండ్రి సిబిఐ ఆఫీసర్. తల్లి గృహిణి.

సుధాకర నాయుడు ఢిల్లీలో లా పూర్తిచేసి,ఎపి హైకోర్టులో రెండేళ్లు ప్రాక్టీస్ చేసాడు. ఆతర్వాత అమెరికాలో ఎం ఎస్ ఇంటర్ నేషనల్ లా పూర్తిచేసాడు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఈయనకు మామ వరుస అవుతాడు. ఫారిన్ నుంచి వచ్చాక దాసరిని కలవగా ఎక్కడో ప్రాక్టీస్ ఎందుకు,సినిమాల్లోకి రావచ్చు కదా అని దాసరి అన్నారట. ఆవిధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుధాకర్ అనే తెలుగు కమెడియన్ ఉండడం,సుధాకర్ నాయుడు మెగాస్టార్ అభిమాని కావడం దృష్టిలో ఉంచుకుని చిరంజీవిలో చివరి రెండక్షరాలతో జివి అనే పేరు పెట్టారు దాసరి.

ఆ విధంగా జివి పేరిట విలన్ రాణించిన సుధాకర నాయుడు అంతః పురం మూవీలో విలన్ పాత్రతో బాగా గుర్తింపు పొందాడు.ఇక చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమా లో జివి నటించాడు. షూటింగ్ సమయంలో చిరు కుటుంబ సభ్యులు కొందరు సెట్స్ కి వచ్చి,అక్కడ జీవిని చూసి ఆశ్చర్య పోయారు. ఈయన ఇక్కడున్నాడేంటి అని అడిగేసరికి,ఈ సినిమాలో చిన్న పాత్ర వేస్తున్నాడని చిరు చెప్పారట.

అప్పుడు చిరుకి,జీవికి గల సంబంధం వారు వివరించారట. చిరుకి జివి సోదరుడు వరుస అవుతాడని అప్పుడు తెలిసింది. చిరుతో బంధం ఉన్నాసరే,ఎక్కడా చెప్పుకోకుండా స్వశక్తితో ఎదిగిన జివి సుధాకర్ నాయుడు డైరెక్టర్ గా చేసాడు. నితిన్ హీరోగా వచ్చిన హీరో సినిమాకు జివి దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ హీరోగా రంగాది దొంగ సినిమాకు డైరెక్షన్ చేసాడు.