Kitchen

హైదరాబాద్ లో టేస్టీ ఫుడ్స్ దొరికే టాప్ 10 ప్లేస్ లు తెలుసా? ఒక లుక్ వేయండి

గతంలో ఉదయం టిఫిన్ అంటే ఉదయమే తినేవారు. కానీ ఇప్పుడు అన్ని చోట్లా అన్ని వేళలా టిఫిన్ అందుబాటులోకి ఉంటోంది. పైగా తినేవాళ్లు ఉంటున్నారు. అసలు ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక తీసుకునే ఫుడ్ బ్రేక్ ఫాస్ట్. కానీ ఇప్పుడున్న జనరేషన్ బ్రేక్ ఫాస్ట్ అర్ధమే మార్చేశారు . ఎర్లీ మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకూ హైదరాబాద్ లో టిఫిన్స్ కి కరువే లేదు. 24/7 రౌండ్ ది క్లాక్ భాగ్యనగరం లో దొరికే టేస్టీ బ్రేక్ ఫాస్ట్ తిన్నారంటే ఎవరు ఐనా ఫిదా అవ్వాల్సిందే .ఎప్పటి నుండో కృష్ణ నగర్ లో ఉన్న పూర్ణ టిఫిన్ సెంటర్ నుండి రామ్ కి బండి వరకు ది బెస్ట్ అండ్ టేస్టీ దోస , ఇడ్లి వెరైటీస్ సెర్వ్ చేసే టిఫిన్ అడ్డాస్ ఇంకా ఎక్కడెక్కడ ఏం ఉన్నాయో చూసి వీలయితే ఓ మూడు,నాలుగు మసాలా దోస లు లాగించేయొచ్చు. ముఖ్యంగా ఓ పది సెంటర్ల లో దొరికే టేస్టీ ఫుడ్ కోసం పరిశీలిద్దాం

1.Ram Ki Bandi – MJ Market, Nampally

దోస , ఇడ్లి తినాలి అని హైదరాబాద్ లో ఎవరిని అడిగినా వారి దగ్గర నుండి రామ్ కి బండి అనే సమాధానం వినిపిస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ లో దొరికే మసాలా , బట్టర్ దోస , తవ ఇడ్లి , బట్టర్ ఇడ్లీ కి డిమాండ్ ఎంతో చెప్పలేం. ఇక చట్నీ అయితే చెప్పక్కర్లేదు.

2.Poorna Tiffins centre – Krishna Nagar

కృష్ణ నగర్ లో పూర్ణ టిఫిన్స్ సెంటర్ బాగా పాపులర్. అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అంత ఇక్కడే టిఫిన్ చేసే వాళ్ళట. చాలాకాలం నుంచి ఉన్న ఈ టిఫిన్ సెంటర్ లో నెయ్యి ఇడ్లీ , పెసరట్టు ఉప్మా కోసం క్యూ కడతారు. ఎపుడైనా అటు సైడ్ వెళ్తే ఓ సారి అక్కడ రుచి చూడాల్సిందే.

3. Rahul Tiffins Centre – Himayat Nagar

రాహుల్ టిఫిన్స్ సెంటర్ లో ఇడ్లి , దోస ,వడ , ఉప్మా వంటి టిఫిన్స్ లో కనీసం 5రకాలైనా ఉంటాయి. ఇక బట్టర్ రోస్టెడ్ వడ,పన్నీర్ + చీజ్ ఇడ్లీ , షెజవాన్ ఉప్మా వంటి వాటికి ఇదే పాపులర్.

4.Govind Dosas – Gulzar Hauz, Charminar

హైదరాబాద్ పాత బస్తీలో బిర్యానీ కి ప్రసిద్ధి. అయితే గూలీజర్ హౌస్ ,ఝాన్సీ బజార్ లోని గోవింద్ దోస టిఫిన్ సెంటర్ లో నార్త్ ఇండియా స్టైల్ లో వేసే దోస లకు ప్రసిద్ధి, ఎంతో రుచిగా ఉంటాయి. చిన్న బండ్ మీద స్ట్రీట్ లో ఉండే ఈ టిఫిన్ సెంటర్ నిత్యం రద్దీగా ఉంటుంది.

5.Dosa Empire – Basheer Bagh

ఇక్కడ వెరైటీ దోశ లకు ప్రసిద్ధి. మష్రూమ్ , కార్న్ , చీజ్, స్చెజవాన్ ఫ్లావర్స్ లో ఇక్కడ దాదాపు 100రకాల దోశలు దొరుకుతాయి. దేనికదే రుచిగా ఉంటుంది.

6. Hari Dosa – Ameerpet

సత్యం థియేటర్ వీధిలో ఉండే ఈ టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్. ఇక్కడ పాప్ భాజీ,మంచూరియన్ ,పాలక్ పనీర్ దోశ లభిస్తాయి. అన్నీ కొంచెం ధర ఎక్కువగానే ఉంటాయి కానీ టేస్ట్ కూడా ఎక్కువే. దోశలతో పాటు కాజు ఉప్మా , స్చెజవాన్ ఉప్మా కూడా ఇక్కడ ప్రసిద్ధి.

7.Laxman Ki Bandi – Begum Bazaar

దేశవాళీ దోశ తినాలని అనిపిస్తే అందుకు చక్కని ప్లేస్ ఇది. లక్ష్మణ్ కి బండి దగ్గర తక్కువ ధరకు బట్టర్ మసాలా , పేపర్ మసాలా, పిజ్జా దోశ లు ఇక్కడ దొరికినట్టు ఎక్కడా దొరకవని చెప్పాలి.

8. AM PM – Tolichowki (only 6 PM to 6 AM

కేవలం సాయంత్రం ఆరు నుంచి ఉదయం 6వరకూ మాత్రమే ఏ ఎం – పీఎం టిఫిన్ సెంటర్ పనిచేస్తుంది. రాత్రి డ్యూటీ చేసేవారికి అనువైన హోటల్ ఇది. ఇక్కడ రవ్వ ఇడ్లి,రోస్టెడ్ మైసూరు బజ్జీ చాలా రుచిగా ఉంటాయి.

9. Pragati Tiffin Center – Sultan Bazaar, Koti

కోటి – సుల్తాన్ బజార్ లోని ప్రగతి కాలేజీ ఎదురుగా ఉండే , ప్రగతి టిఫిన్ సెంటర్ లో ఉదయం 6.30 నుంచి రాత్రి 9గంటల వరకూ ఇక్కడ ఉండే రద్దీ అంతాఇంతా కాదు. ఇక్కడ మౌత్ -వాటరింగ్ టిఫిన్స్ అంటే పనీర్ ,ఆనియన్ దోశ లకు ప్రసిద్ధి. ఒక్కసారి తింటే ఇక వదిలిపెట్టరు.

10.House of Dosa – Banjara Hills

ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువే. అయితే నాణ్యత , రుచి విషయంలో ఏమాత్రం తేడా ఉండదు. కారం దోశ, మసాలా దోశ ఎర్ర కారం అండ్ బొంబాయి చట్నీ లతో కల్పి దొరుకుతాయి. ఒకసారి తింటే ఇక వదిలిపెట్టరు. కుండ లస్సి , షరబత్స్ కూడా దొరుకుతాయి.