కుష్బూ తన జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే అయ్యో పాపం అని అనకుండా ఉండలేరు
బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కుష్బూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్ హీరోయిన్ అయింది. 1970 సెప్టెంబర్ 29న ముంబయిలో జన్మించింది. ముస్లిం దేశంలో పఠాన్ లంటే వీరులని అర్ధం. అలాంటి పఠాన్ ల వంశానికి చెందిన ఆఫ్ఘనీ స్థాన్ వాసులు కుష్భు పేరెంట్స్ . కుష్బూ అసలుపేరు నఖత్ ఖాన్. 1980లో బాలీవుడ్ లో వచ్చిన బర్నింగ్ ట్రైన్ మూవీ కుష్బూ కెరీర్ లో తొలిచిత్రం. ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 1985వరకూ బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించింది.
ఇక తండ్రి ఓ శాడిస్టు కావడంతో నిత్యం నరకం చూసిన కుష్బూ 8ఏళ్ళ వయస్సు నుంచి సినిమాల్లో నటించింది. అలా సంపాదించిన సొమ్ములను తీసేసుకోవడమే కాదు,ఆమెను,తల్లిని కూడా తండ్రి వేధించేవాడు. అంతేకాదు భిక్షాటన చేసి డబ్బులు తీసుకురమ్మని హింసపెట్టేవాడు. ఇక 1986లో సినిమాలు చేసే సమయంలో కాళ్ళు లేనిదానిలా పాక్కుంటూ వెళ్లి డబ్బులు అడుక్కుని తెమ్మన్నాడట.
దాంతో తల్లిని,సోదరుడిని తీసుకుని కుష్బూ బయటకు వచ్చేసింది. టీనేజ్ లో సహాయ నటిగా ఛాన్స్ లు వచ్చాయి. ఇక హీరోయిన్ గా జాకీ ష్రాఫ్ తో జాను మూవీలో చేసింది. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కుష్భు 1986లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కలియుగ పాండవులు మూవీతో తెలుగు తెరపై హీరోయిన్ గా మెరిసింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో నాగార్జునతో కెప్టెన్ సినిమాలో చేసి, తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది.
మరోవైపు తల్లిని,సోదరుడిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇక భర్త సుందర్ కూడా సహృదయుడు కావడంతో అందరూ కల్సి మెలిసి హ్యాపీ గా ఉంటున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన కుష్బూ, అభిమానుల పాలిట ఆరాధ్య దైవంగా మారింది. ఆ విధంగా తండ్రి వలన పడ్డ కష్టాలను అభిమానుల కారణంగా బాధలను మరిచిపోయింది. తమిళంలో ఆమెకు ఏకంగా గుడి కట్టేసారు. అంతేకాదు అప్పట్లో మెత్తగా ఉండే ఇడ్లిలకు కుష్బూ ఇడ్లి అని పేరు పెట్టేసి అమ్మేవారు.