Politics

ఇషా అంబానీ – ఆనంద్ పిరమల్ కి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా

డబ్బుంటే హంగామాకి హడావిడికి కొదవ ఉండదు. అందుకే గొప్పింటి పెళ్లిళ్లు ఆకట్టుకుంటాయి. ఇక ముఖేష్ అంబానీ ఏకైక కూతురు ఈషా అంబానీ కూతురు పెళ్లి అంటే వేరే చెప్పక్కర్లేదు. అపర కుబేరుడు కదా. అయితే పెళ్లి వేడుక అంగరంగ వైభవంగానే సాగింది. ఈ సందర్బంగా ఉదయ పూర్ లో మూడు రోజులపాటు భారీ ఎత్తున అన్నదానం చేసారు. అన్నదానం అంటే ఏదోసాదాసీదాగా కాదు, పంచభక్ష్య పరమాన్నాలతో కొసరి కొసరి వడ్డించారు. అంబానీ కుటుంబం,ఆనంద్ పిరమల్ ఫ్యామిలీ కూడా స్వయంగా వడ్డిస్తూ దివ్యంగులకు,పేదలకు కడుపు నిండా భోజనం పెట్టి సంతృప్తి పరిచి, వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ఇక ఆదివారం జరిగిన సంగీత్ కార్యక్రమానికి బాలీవుడ్ లో సెలబ్రిటీలే కాదు, దేశవిదేశాల్లో రిలయన్స్ గ్రూపులోని వాటాదారులు,పెట్టుబడి దారులు,షేర్ హోల్డర్స్, ప్రముఖులు అందరూ తరలివచ్చారు. ఇక ఇషా అంబానీ పెళ్ళికి సంబంధించి వివరాలు,ఇషా బ్యాక్ గ్రౌండ్ ఆమె చేసుకోబోయే వరుడు ఆనంద్ పిరమల్ బ్యాక్ గ్రౌండ్ అన్నీ ఆసక్తిగా నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

ఇప్పటికే కొడుకు ఆకాష్ అంబానీకి పెళ్లి అయింది. కోడలు శ్లోక మెహతా వజ్రాల వ్యాపారి కూతురు. ఆకాష్,శ్లోక లకు ఆస్తిపాస్తుల గురించి చెప్పక్కర్లేదు.మరి అంబానీ కూతురు ఇషా అంబానీ మ్యారేజ్ చేసుకోబోయే ఆనంద్ పిరమల్ ఎవరంటే పిరమల్ గ్రూప్ అధినేత కి ఒక్కగాన ఒక్క కొడుకు. కూతురు కూడా ఉంది. అయితే ఆస్థి విషయంలో ముఖేష్ అంబానీ టాప్ వన్ లో ఉంటె,వీళ్ళు టాప్ టెన్ లోనే ఉన్నారు. ఆనంద్ పిరామల్ దేశవిదేశాల్లో రకరకాల డిగ్రీలు,పీజీలు పూర్తిచేసాడు.

అయితే ఆనంద్ పిరమల్, ఇషా అంబానీ వయస్సు తేడా దాదాపు తొమ్మిదేళ్లు ఉందట. ఈషాకు 27ఏళ్ళు అయితే ఆనంద్ పిరామల్ కి 34 ఏళ్ళు అని అంటున్నారు. కొన్ని చోట్ల వీరి ఏజ్ తేడా ఏడేళ్లు అని, కొన్నిచోట్ల 9ఏళ్ళు అని రాసి వుంది. మొత్తానికి 7నుంచి 9ఏళ్ళ వయస్సు తేడా ఇద్దరి మధ్యా ఉంది. అయితే వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ వీరిని పెళ్లిపీటలు ఎక్కించింది.