Politics

KCR మళ్ళీ CM అవ్వటానికి 5 ప్రధాన కారణాలు ఇవే?

తెలంగాణలో ముందస్తు ముచ్చట తీరింది. మంచి ఫలితాన్ని అందించింది. కేసీఆర్ రెండోసారి సీఎం గా ప్రమాణం చేయబోతున్నారు. ఎన్నికలకు వెళ్లి ఓటమి చవిచూశారు. కానీ రాష్ట్రం విడిపోయాక తెలంగాణ లో అధికారం చేపట్టిన కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భుత విజయాన్ని అందుకుని కొత్త చరిత్ర సృష్టించారు. ఎలాగైనా కేసీఆర్ ని గద్దె దించడానికి కాంగ్రెస్ , టీడీపీ,టిజెఎస్ , సిపిఐ ఉమ్మడిగా ప్రజా కూటమిగా ఏర్పడి చేసిన పోరాటం బెడిసికొట్టింది. 2009లో మహాకూటమి ని ఎదుర్కొని ఆనాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ అధికార పగ్గాలు ఎలా చేపట్టారో, ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రజకూటమితో పోరాడి,మళ్ళీ అధికారం సాధించారు.

ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమం నడిపిన ఉద్యమ నేత కేసీఆర్ ఇప్పుడు ప్రజానేతగా గుర్తింపు పొందాడు. సీఎంగా అందించిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి ,తన సత్తా చాటాడు. అప్పట్లో డాక్టర్ వైఎస్ ప్రతికుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పధకం అందించి, ప్రజాహృదయాల్లో నిల్చి రెండవసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు కేసీఆర్ అదే ఫార్ములా తో ప్రజాహృదయాలను గెలిచారు. మనిషి బతకలాంటే డబ్బు,నివాసం కోసం ఇల్లు,తాగడానికి నీళ్లు ఇలా కనీస అవసరాలను గుర్తించి వాటిని అమలు చేయడానికి చేసిన కృషి మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఉద్యమ నాయకుడిగా ఉండగానే తెలంగాణకు ఏది అవసరమో గుర్తించిన కేసీఆర్ తన చతురతతో ప్రజావసరాలను తీర్చడానికి కృషిచేశారు. 24 గంటల పాటు ఇచ్చిన కరెంట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. రైతులకు కనీస మద్దతు ధరపై దృష్టి పెట్టిన కేసీఆర్ సీజర్ కి నాలుగువేల చొప్పున ఏడాదికి 8వేలు చొప్పున అందించారు.

త ద్వారా రైతులను వేధించే సమస్యను పరిష్కరించిన ఘనత సాధించారు. ఉదాహరణకు ఒకరైతుకి నాలుగు ఎకరాల పొలం ఉంటె,పంటకు ముందే ఏడాదికి 32వేల రూపాయలు చేతికి వచ్చేసేలా చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. 24గంటల కరెంట్,నీళ్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవడం ప్రజల దృష్టిలో కేసీఆర్ ని హీరోని చేశాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ స్కిం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. చాలామందికి ఇళ్లు ఇవ్వడంతో పాటు మిగిలిన వాళ్లకు కూడా ఇళ్ళు ఇస్తామన్న భరోసా కల్పించారు. ఇది ఓట్ల వర్షం కురిపించిందనే చెప్పాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యం ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే నానా కష్టాలు పడాలి.
Kcr And Putarekulu
అలాంటి వారికి కల్యాణ లక్ష్మి పేరిట లక్ష రూపాయలు అందిచడం మామూలు విషయం కాదు. ఇలా ఎందరికో కల్యాణ లక్ష్మి ద్వారా సాయం అందించడంతో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. మరి కేసీఆర్ గెలుపులో ఈ అంశం పెద్ద ప్రభావమే చూపించింది. ఇలా ఎన్నో పధకాలు కేసీఆర్ ని రెండోసారి అందలం ఎక్కించాయి.