Movies

సింగర్ కౌసల్య గుర్తు ఉందా….నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలుసా?

ఆధునిక సమాజంలో కూడా ఆడవాళ్ళ కు కష్టాలు,వేధింపులు తప్పడం లేదు. పెళ్లయ్యాక ఆడవాళ్లు తమ జీవితంలో పడుతున్న ఇబ్బందులు, నరకయాతన అనుభవిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. సెలబ్రిటీలు సైతం దీనికి మినహాయింపు కాదు. వేధింపులు , ఇబ్బందులు తాళలేక విడిపోతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ప్రముఖ గాయనిగా రాణిస్తున్న సింగర్ కౌసల్య కూడా ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తోంది.
ఇంతకీ ఈమె ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటోందో అంటే,చిన్ననాటి ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కౌసల్య. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఆమె ఎన్నో వేధింపులకు గురైంది.

ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా మార్పు లేదు. దీంతో ఇలాంటి సైకోతో విడిపోవడమే మేలని భావించింది. కొడుకుని తీసుకుని అలా విడిపోయిన కౌసల్య ఒంటరిగా జీవిస్తోంది. ఇక కౌసల్య ఎదుర్కొన్న చిత్ర హింసలు చాలా దారుణం. వాటి గురించి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె వెల్లడించింది. ‘నేను ఆరేళ్లపాటు టార్చర్ చవిచూశాను. ఇక అంతకు మించి భరించడం నా వలన కాకపోవడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

పెళ్లయిన 16రోజులకే భర్త అందరి ముందు అసభ్య పదజాలంతో తిట్టాడు. దారుణంగా కొట్టాడు. అతడి ప్రవర్తన చూసి అతడి పేరెంట్స్ కూడా షాకయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఇంటా వంటా ఇలా కొట్టడం,తిట్టడం లేదు. మరి వీడికి ఎలా వచ్చాయో అని పేరెంట్స్ కూడా బాధపడేవారు’అని కౌసల్య చెప్పుకొచ్చింది.

చివరకు చీర కట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా అదేంటి ఇదేంటి అని సతాయించే వాడని, అసలు స్వేచ్ఛ లేకుండా పోయిందని కౌసల్య ఎమోషనల్ అయింది. ఎంత వేధించినా తట్టుకున్నానని, ఇక హింస మధ్య ఉండడం నా వల్ల కాలేదని, అందుకే విడిపోవాల్సి వచ్చిందని చెప్పింది. కొడుకుని కూడా కొట్టడం,తిట్టడం చేసేవాడని,ఇక ఇలాంటి వ్యక్తితో ఉండడం కష్టమని భావించి విడిపోయానని పేర్కొంది.అయితే మరో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని కూడా చెప్పింది.