Movies

రేపు సుబ్రమణ్య షష్టి రోజున ఈ ఒక్క పని చేస్తే దోషాలు తొలగిపోయి పట్టిందల్లా బంగారమే

మార్గశిర సుద్ద షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని పిలుస్తాం. ఆ రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు కారణంగా సుబ్రహ్మణ్య స్వామికి నిష్టగా పూజలు చేస్తూ ఉంటాం. అయితే సుబ్రమణ్య షష్టి రోజున ఏ విధంగా పూజలు చేస్తే దోషాలు తొలగిపోయి సంతోషముగా ఉంటామో తెలుసుకుందాం. అలాగే సుబ్రమణ్య స్వామి ప్రసన్నం కావాలంటే ఏమి చేయాలో కూడా తెలుసుకుందాం. స్త్రోత్ర పారాయణం చేస్తే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి. అందువల్ల సుబ్రమణ్య స్తోత్రం లేదా సుబ్రమణ్య స్తవం వంటివి పారాయణం చేయాలి. అలాగే సుబ్రమణ్య స్వామికి ఎర్రటి పువ్వులు,ఎర్రటి అక్షింతలు,ఎర్రటి గంధం,ఎర్రటి వస్త్రాలు సమర్పిస్తే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది.

అంతేకాకుండా సుబ్రమణ్య స్వామి కళ్యాణం జరిపిస్తే కూడా మంచి జరుగుతుంది. చేసే పనులలో ఏమైనా అంటంకాలు ఉంటే తొలగిపోతాయి. జాతకంలో ఏమైనా సర్ప దోషాలు ఉన్నా తొలగిపోతాయి. సంతానం లేనివారికి,కుజ దోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. బ్రహ్మచారికి స్వయంపాకం,ఎర్రటి వస్త్రాలు సమర్పిస్తే దోషాలు తొలగుతాయి.

సుబ్రహ్మణ్య స్వామిని మయూర వాహనం మీద ఉరేగించినప్పుడు ఆ వాహనాన్ని మోయటానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయటం వలన జన్మాంతరాలలో చేసిన కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేస్తే జ్ఞానము లభిస్తుంది. జ్ఞానము కలగటం వలన మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరటానికి మార్గం కలుగుతుంది.

సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం అయినా సూలంను ఇంటిలో ఉంచి పూజిస్తే శత్రు భయాలు అన్ని తొలగిపోయాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు అయినా సుబ్రమణ్య షష్టి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే జాతకంలో ఉన్న దోషాలు మరియు మన నిత్య జీవితంలో వచ్చే కష్టాలు,బాధలు అన్ని తొలగిపోతాయి.