Movies

AVS భార్య పిల్లలు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా? నమ్మలేని నిజాలు

జర్నలిస్టుగా,రచయితగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన నటుడు ఏవీఎస్ రెండు దశాబ్దాల పాటు 500 చిత్రాల్లో నటించాడు. నత్తి నత్తిగా డైలాగులు చెబుతూ అతికొద్ది కాలంలోనే నటుడిగా గుర్తింపు పొందారు. బ్రహ్మానందం,కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ వంటి వాళ్ళు బాగా రాణిస్తున్న కాలంలో ఏవీఎస్ తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఏవీఎస్ డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటాడు. అయితే అర్ధాంతరంగా అనంతలోకాలకు వెళ్ళిపోయి అందరిని దిగ్భ్రాంతికి గురిచేసారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఏవీఎస్ 1957జనవరి న జన్మించారు. ఈయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. డిగ్రీ చదివే రోజుల్లో నాటకాలు వేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.

మంచి మిమిక్రి ఆర్టిస్టు కూడా అయిన ఏవీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజంలో ప్రవేశించి ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేసి,అప్పట్లో నెలకు 500జీతం అందుకునేవారు. అదే పత్రికకు ఒంగోలు జిల్లా ఇంఛార్జిగా వ్యవహరించారు. అయితే సినిమాలపై మోజుతో ఉద్యగం వదిలేసి హైదరాబాద్ చేరిన ఏవీఎస్ తొలిసినిమా మిస్టర్ పెళ్ళాం మూవీతో తుత్తి భాషను పరిచయం చేసి,మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక సూపర్ హీరోస్ సినిమాతో డైరెక్టర్ గా అవతారం ఎత్తి, నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంకుల్ మూవీతో ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇక చిత్ర పరిశ్రమలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇక ఏవీఎస్ నాటకాలు వేసేటప్పుడు ఆశా కిరణ్మయి అనే ఆమెను ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి శ్రీప్రశాంతి ,ప్రదీప్ అనే ఇద్దరు పిల్లలున్నారు. కాలేయ వ్యాధి సోకడంతో అప్పులపాలయ్యారు.

తండ్రి లివర్ చెడిపోతే తన లివర్ లో కొంత భాగం కూతురు దానం చేసింది. కొడుకు కూడా లివర్ భాగం ఇవ్వడానికి ముందుకొచ్చినా కూతురు లివర్ మాత్రమే సూటవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆవిధంగా చేసారు. ఆతర్వాత కొడుకు పెళ్లి చేసిన కొద్ది కాలానికే ఏవీఎస్ కి లివర్ వ్యాధి ముదరడంతో ప్రాణాలు కోల్పోయారు. ఏవీఎస్ కొడుకు ప్రదీప్ సినీ డైరెక్టర్ గా ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు.

మొదట్లో ఓ షార్ట్ ఫిలిం చేసాడు. దీనికి మంచి పేరు రావడంతో షార్ట్ ఫిలిమ్స్ తో పాటు డిజిటల్ మార్కెట్ లో కూడా కొనసాగుతున్నాడు. ఇక కూతురు ప్రశాంతి కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కాగా ఏవీఎస్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను గుర్తించి తెలుగు డైరెక్టర్ల సంఘం లక్షా పాతికవేల రూపాయల విరాళం అందించింది. ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ఏవీఎస్ మూడు దఫాలు ప్రధాన కార్యదర్శిగా చేసి,ఎన్నో మంచి పనులు చేయడంతో పలువురు ఏవీఎస్ ని తలచుకుంటూ ఉంటారు.