Movies

హీరోయిన్ గజాల గుర్తు ఉందా…ఆమె ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా?

తెలుగు,తమిళ ,మళయాళ చిత్రాల్లో చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న గజాలా 2001లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీకి దూరం అయింది. ఓ తెలుగు హీరో మోసం చేశాడన్న కారణంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆతర్వాత మళ్ళీ హైదరాబాద్ లో కనిపించలేదు. ఇక ఛాన్స్ లు రావడం లేదని బాధపడకుండా పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. నాలొఉన్న ప్రేమ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని, స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

కలుసుకోవాలని, ఓ చిన్నదాన,విజయం,అల్లరిరాముడు,తొట్టిగ్యాంగ్ వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గజాలా 1985 మే19న ముంబైలో జన్మించింది. అయితే చాలాకాలం క్రితమే ఆమె ఫామిలీ కువైట్ లో స్థిరపడిపోయింది. సినిమా మోజుతో ఇండియాకు వచ్చిన ఈమె మొదట్లో నటించిన సినిమాలన్నీ మంచి హిట్ అందుకున్నాయి. జగపతి బాబుతో నాలో ఉన్న ప్రేమ, ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాలు హిట్స్ తో ఆమె కెరీర్ కి మంచి మార్గం ఏర్పడినప్పటికీ టాప్ హీరోల సరసన ఆమెకు ఛాన్స్ లు దక్కలేదు.

పోనీ తెలుగులో ఇలా ఉందంటే,తమిళ,మాలయంలోనూ గజాలాకు స్టార్ హీరోలతో ఛాన్స్ లు దక్కలేదు. ఇక ఇదే సమయంలో టాలీవుడ్ యువహీరోతో ఆమెకు లవ్ ఫెల్యూర్ అయిందన్న టాక్ బలంగా వచ్చింది. దీంతో హైదరాబాద్ వదిలేసి ముంబయ్ వెళ్లిపోయిన ఆమె అక్కడ టివి నటుడు ఫైజల్ రాజాఖాన్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. టివి సీరియల్స్ లో నెగెటివ్ కేరక్టర్స్ తో పాపులర్ అయిన ఫైజల్ తనకు సరిజోడీగా భావించి, నాలుగేళ్ల ప్రేమ అనంతరం 2016లో పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఆమె భర్త డైరెక్షన్ లో టివి సీరియల్స్ చేయాలనీ భావిస్తోందట.