Movies

జమున కుమార్తె హీరోయిన్ కాకపోవడానికి అసలు కారణం తెలుసా ?

స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా, స్టార్ హీరోయిన్స్ కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. అయితే అలనాటి అందాల నటి, అభినయంలో మేటి అయిన జమున కుమార్తె స్రవంతి మాత్రం సినిమాల్లోకి రాకపోవటానికి పెద్ద కారణం ఉంది. స్వతహాగా మంచి థియేటర్ ఆర్టిస్ట్,మంచి చిత్రకారిణి కూడా అయిన ఆమె అప్పుడపుడు సంగీత,నృత్య రూపకాల్లో పాలుపంచుకుంటోది. ఆమె రూపొందించిన త్వమేవాహం షో విపరీతమైన పాపులార్టీ తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని తపించిన స్రవంతి ఆదిశగా విజయం సాధించింది. అయితే డాక్టర్ వృత్తిలో కొనసాగడం లేదు. అలాగని సినిమాల్లోకి రాలేదు.

ఆనాటి స్టార్ హీరోయిన్ జమున అందం, అభినయం గల హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఈమె తమ సినిమాల్లో కావాలంటే తమ సినిమాల్లో కావాలని అప్పటి అగ్ర నటులు ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్ నిర్మాతలను పట్టుబట్టేవారట. ఇక సత్యభామ పాత్రకు ఆమె పెట్టింది పేరు. తెలుగునాట సత్యభామగా ఆమె విశేష ఖ్యాతి సొంతం చేసుకుంది.

మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరుప్రతిష్టలు పొందిన క్రమశిక్షణ గల నటిగా ఇండస్ట్రీలో నిలిచింది. రంగస్థలంలో జగ్గయ్య, గుమ్మడి వంటి ఉద్దండులతో నాటకాలు వేసిన జమున తన కెరీర్ ని ఉన్నతంగా మలుచుకుంది. పుట్టిల్లు అనే మూవీతో తెలుగు వెండితెరపై మెరిసిన జమున అది పౌరాణికమైనా,జానపదమైనా, సాంఘికమైనా సరే, తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసింది.

అన్ని భాషల్లో కల్పి దాదాపు 200చిత్రాల్లో నటించిన ఈమె మంచి పొజిషన్ లో ఉండగానే ఉస్మానియా యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేసే జూలూరి రమణారావు ని పెళ్లి చేసుకుంది. వంశీకృష్ణ అనే కుమారుడు,స్రవంతి అనే కుమార్తె ఉన్నారు. కాలిపోర్నియాలో ఉండగా నేర్చుకున్న గ్లాస్ పెయింటింగ్ లో ప్రావీణ్యం పొందిన స్రవంతి ఆ పెయింటింగ్ ని భారత్ లో కూడా ప్రవేశపెడుతూ ఎన్నో పెయింటింగ్స్ వేసింది. ఇక ఈమె పెళ్లిచేసుకున్నాక ఓ కొడుకు పుట్టాడు.

అయితే భర్తతో తేడా రావడంతో కొడుకుని తీసుకుని వచ్చేసి స్వతంత్రంగా జీవిస్తోంది. అయితే తనకు సినిమాల్లోకి రావాలని లేదని అమ్మలా పేరు తెచ్చుకోవాలని ఉందని చెప్పే స్రవంతి కుమారుడు అవిష్ కూడా ఆర్టిస్ట్ గా పలు చిత్రాలతో గుర్తింపు పొందాడు. అవిష్ చిత్రాలతో ఓ ఎగ్జిబిషన్ కూడా ఇటీవల నిర్వహించారట.