Movies

అలనాటి హీరోయిన్ ప్రభ గుర్తు ఉందా… ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

అలనాటి అందాల హీరోయిన్స్ లో అభినయం కలగసిన నటి ప్రభ భూమికోసం చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. ఈమె కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం సంపాదించి , మరీ 1974లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె నీడలేని ఆడది మూవీతో తొలిసారి వెండితెరపై మెరిసింది. ఎన్టీఆర్ ,ఏ ఎన్ ఆర్ వంటి అగ్రనటులతో,చంద్రమోహన్,రంగనాధ్ వంటి ద్వితీయశ్రేణి నటులతో కూడా నటించింది. ఇక చంద్రమోహన్ తో అయితే ఏకంగా 18సినిమాల్లో చేసి, వీరిద్దరూ ఆరోజుల్లో హిట్ ఫెయిర్ గా నిలిచారు. ఇక మురళీమోహన్ తో 16చిత్రాలు చేసింది. దక్షిణాది భాషల్లో 150సినిమాలకు పైనే నటించి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలదన్న పేరు తెచ్చుకుంది.

తెనాలి ప్రాంతానికి చెందిన ప్రభ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి సుబ్రహ్మణ్యం,తల్లి రమణమ్మ. చిన్ననాడు కూచిపూడి నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ప్రభ,ఆతర్వాత వెంపటి చినసత్యం దగ్గర సీరియస్ నాట్యం నేర్చుకుంది. అయితే 1988లో తొలి ప్రదర్శన ఇచ్చింది. అప్పటికే ఆమెకు సినీ ఛాన్స్ లు తగ్గాయి. అసలు సినిమాల్లో మోజుతో ఇండస్త్రీలోకి వచ్చిన ప్రభకు మొదట్లో ప్రాధ్యాన్యత గల పాత్రలు లభించలేదు.

ఆతర్వాత పెద్ద హీరోల సినిమాల్లో సహాయనటిగా చేసిన ఈమె ఆతర్వాత చిన్న హీరోలతో హీరోయిన్ గా చేసి హిట్స్ అందుకుంది. ఇక ప్రభ కెరీర్ లో ఎన్నో గోల్డెన్ ఛాన్స్ లు మిస్స్సయ్యాయి. ఖైదీ సినిమాలో సుమలత పోషించిన పాత్రకు మొదట్లో ప్రభను అనుకున్నారట. డేట్స్ కుదరకపోవడంతో మంచి ఛాన్స్ పోయింది. అయితే ఆ సినిమా ఒప్పుకుంటే అప్పటికే చేతిలో గల 10మూవీస్ చేజారిపోయేవని ఓ ఇంటర్యూలో ప్రభ వెల్లడించింది.

అంతేకాదు కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాల్లో కూడా ఛాన్స్ లు మిస్ చేసుకున్నానని చెప్పి ఎమోషనల్ అయింది. 1988లోనే రమేష్ బాబు అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న ప్రభ,తన నాట్య బృందంతో కల్సి అమెరికాలో దాదాపు 40నృత్య ప్రదర్శనలిచ్చింది. 1999లో భర్త హఠాన్మరణం చెందడంతో ఆమె మానసిక వేదనతో కుంగిపోయింది.

ఆ తరవాత కోలుకున్న ప్రభ ఓ వైపు సినిమాలతో ,మరోవైపు డాన్స్ స్కూల్ తో బిజీగా మారిపోయింది. జయప్రద, జయసుధ ఈమె కు మంచి ఫ్రెండ్స్. ఇటీవల రుద్రమదేవి,జేమ్స్ బ్యాండ్,బెంగాల్ టైగర్ వంటి చిత్రాల్లో నటించింది.