నేచురల్ స్టార్ నాని జీవితంలో మీకు తెలియని నమ్మలేని నిజాలు

చదువులో బిలో ఏవరేజ్ స్టూడెంట్ స్థాయి నుంచి మినిమమ్ గ్యారంటీ హీరోగా రాణించడానికి నేచురల్ స్టార్ నాని పడిన కష్టం ఎక్కువేనని చెప్పాలి. కేవలం 3500రూపాయలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి,కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని డీల్ చేసే రేంజ్ కి ఎదిగాడు. మన పక్కింటి కుర్రాడుగా ఉండే నాని ఓ సాధారణ జెంటిల్ మేన్ గా చెప్ప్పవచ్చు. ఇతడి గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం. గంటా నవీన్ బాబు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ అతడే నాని.

చిన్నప్పటినుంచి చదువులో వెనుకబడ్డ విద్యార్థి,ఇక సినిమాలంటే పిచ్చి. ఇంట్లో వాళ్ళ ఒత్తిడితో ఇంటర్ ,డిగ్రీ చదివినా వాటిపై పెద్దగా మనసు పెట్టలేదు. మార్క్స్ చాలా తక్కువే. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండగా ఓ టివి స్టూడియోకి వెళ్తే ,రాత్రివరకు తిండి తిప్పలు లేకుండా ఉంచేసారట. అయితే నేచురల్ స్టార్ అయ్యాక అదే స్టూడియోకి వెళ్తే, అదే వ్యక్తి డోర్ దగ్గరకు వచ్చి మరీ స్వాగతం పలికాడట.

ఇక నాని ఇంట్లో 18 మంది వరకూ కజిన్స్ ఉండే పెద్ద కుటుంబం. ఇందులో నాని తప్ప అందరూ చదువులో మొదటి స్థానమే. పైగా వాళ్లంతా యుఎస్ లో సెటిల్ అయ్యారు. అయితేనేం నాని ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. ముందు హీరోగా వద్దామనుకుని సరైన ఫిజిక్ లేకపోవడంతో డైరెక్షన్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చాడు. రాధాగోపాళం సినిమాలో బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. కేవలం 3500రూపాయల జీతం తో సరిగ్గా గడవక పోయినా,కెమెరా లెన్స్ దగ్గర నుంచి అన్ని విభాగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.

3,4సినిమాలకు పనిచేసాక అన్ని వచ్చేసినా డైరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఎవరిస్తారా అని ఎదురుచూపు నేపథ్యంలో నాని కష్టాన్ని చూసి, డైరెక్టర్ నందినిరెడ్డి రేడియో జాకీ అఫర్ ఇచ్చింది. కొంతకాలం పనిచేసి వాయిస్ మాడ్యులేషన్, డిక్షన్ భాషపై పట్టు సాధించాడు. అప్పుడు అతడి జీతం 17,000 రూపాయలు. ఓసారి యాడ్ ఫిలిం షూటింగ్ అవుతుంటే, ఆసమయంలో అక్కడికి రావాల్సిన వాళ్ళు రాకపోవడంతో అసిస్టెంట్ గా చేసున్న నాని, నాలుగు ముక్కల స్క్రిప్ట్ రాసి యాక్ట్ చేసి చూపించడంతో అది నచ్చి,చివరకు నాని చేత చేయించారు.

అలా యాడ్ లో నటించిన నాని హీరో అవ్వడం కూడా విచిత్రంగానే జరిగింది. యాడ్ ఫిలిం సమయంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ అక్కడికి వచ్చి అష్టా చెమ్మా మూవీతో హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. సినిమా పూర్తయ్యాక కూడా ఇక ఛాన్స్ లు వస్తాయన్న కాన్ఫిడెన్స్ నానికి లేదు. కనీసం ఓ సినిమా అయినా చేశానన్న తృప్తి మిగులుతుందిలే అని అనుకున్నాడట.