Politics

ఎన్టీఆర్ , వైస్సార్ సినిమాలు ఎంతవరకూ ఓట్ల వర్షం కురిపిస్తాయో….గెలుపు ఎవరిది?

ఎన్నికలన్నాక రకరకాల ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ప్రచారానికి పదును పెట్టె ఏ అంశాన్ని ఎవరు వదులుకోరు. ఇక గత నాలుగు దశాబ్దాలుగా తెలుగులో ఎన్నికల సమయంలో సినిమాలు రావడం పరిపాటి. ఏదో ఒక సెంటిమెంట్ తో సినిమాలు రావడం,కలెక్షన్స్ తో పాటు ఓట్ల వర్షం కురవడం వంటి పరిణామాలు కూడా జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖుల జీవితాల ధ్యేయంగా సినిమాలు రెడీ అయ్యాయి. అందులో ఒకరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్,పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకుని కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రలు సినిమాలుగా వస్తున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వస్తోంది. ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కనిపించే ఈ బయోపిక్ తొలిభాగానికి కథా
నాయకుడు, రెండవ భాగానికి మహానాయకుడు అని పేరు పెట్టారు. తొలిభాగంలో ఎన్టీఆర్ బాల్యం, సినీ జీవితం ఇతివృత్తంగా ఉంటాయి. జనవరి 9న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.

ఇక రెండవ భాగం రాజకీయ ప్రస్థానం ఉంటుంది. ఎన్టీఆర్ మరణించి 20ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రవేశ పెట్టిన పధకాలు,అమలు చేసిన కార్యక్రమాలు, కేంద్రంపై సాగించిన పోరాటం వంటి అంశాలు ఉంటాయి. మరి ఇది చంద్రబాబుకి గానీ, టిడిపికి గానీ ఎలా ఉపయోగ పడుతుందో ఓట్లు ఎలా తెచ్చి పెడతాయో చూడాలి. ఎందుకంటే మరోపక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ అని రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు. ఇందులోని సాంగ్ ఇప్పటికే వివాదంఅయింది .

ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర పేరిట సినిమా తీస్తున్నారు. ముమ్ముట్టి వైఎస్ పాత్రలో కనిపించబోతున్నాడు. డాక్టర్ వైఎస్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి పధకాలు ప్రజల్లో ఎలా చొచ్చుకుపోయాయో ఈ సినిమాలో చూపించబోతున్నారట.

రాజన్న రాజ్యం తెస్తామని అందుకు తమను గెలిపించాలని జగన్ విజ్ఞప్తితో ఈ సినిమా ముగుస్తుందట. అందుకే ఓట్లు బానే పడతాయని జగన్ అనుచరులు అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్,వైస్సార్ బయోపిక్ లు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో,ఓట్లు ఎలా రాలుస్తాయో వేచిచూడాల్సిందే.