Movies

రాజమౌళి కొడుకు పెళ్ళిలో మెను చూస్తే షాక్ అవుతారు

పెళ్లంటే ఆ సందడే వేరు. రకరకాల డిజైన్స్ తో డ్రెసెస్, సారీస్,విందు భోజనం ,గీత్,సరదాలు ఇలా ఎన్నో ఉంటాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల పెళ్లి ఆదివారం రాత్రి జైపూర్ లోని హోటల్ ఫేర్ మౌంట్ లో అంగరంగ వైభవం గా జరిగింది. ఇంతకీ పూజ ఎవరంటే, ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తే. ఆమె గాయనిగా గుర్తింపు పొందారు. బంధు మిత్రులు, సినీ స్టార్స్,సెలబ్రిటీలు, విచ్చేసిన ఈ పెళ్లి వేడుక కళ్ళు చెదిరేలా జరిగింది. అక్కినేని నాగార్జున,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,రానా, నాని, అనుష్క వంటి స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

రెండు రోజులముందు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా విచ్చేయడంతో మెహందీ,సంగీత్ వంటి వేడుకలు కూడా అట్టహాసంగా సాగాయి. నిజానికి చాలా మొహమాటంగా ఉండే ప్రభాస్ సైతం సంగీత్ ప్రోగ్రాంలో స్టెప్పులతో రెచ్చిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఎంటర్ టైన్ మెంట్ అదిరింది. రాజమౌళి ఏంచేసినా దానికో లెక్క,ప్లాన్ ఉంటాయి. కొడుకు పెళ్లి విందు విషయంలో కూడా తన ప్రత్యేకత ఏమిటో చాటి చెప్పాడు.

పెళ్ళికి వచ్చిన అతిధులకు 20 రకాల రాజస్థానీ సంప్రదాయ వంటకాలను వడ్డించారు. దేశంలోని ప్రముఖ రాజస్థానీ చెఫ్ లను ఒక్క చోటకు చేర్చి మరీ ఈ వంటకాలను గెస్ట్ లకు అందించడం విశేషం. ఎప్పుడూ రుచి చూడని వంటకాలేమో అందరూ లొట్టలేసుకుంటూ లాగించేసారు. దాల్ బటీ చుర్మా, లాల్ మాస్, కేర్ సాంగ్రి, దిల్ కుషాల్,గట్టెకి కిచిడి, బుందో రైటా,రాజస్థానీ కడీ, గట్టెకి పలావ్,లడ్డు,బాదం హల్వా,ఆమ్ కి లాంజీ, మేతి బజరా పూరి,ప్యాజ్ కచోరి, గీవార్ వంటి రాజస్థాన్ వంటకాలను అలాగే వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్స్ అన్నింటిని అతిధులకు తయారు చేయించడంతో,పక్కా రాజస్థానీ వంటకాలు కావడంతో అతిధులు రుచులను ఆస్వాదించారు. కొత్త రుచులు కావడంతో వాటి గురించి అందరూ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఇక ఎన్టీఆర్,ప్రభాస్ లు అయితే చెఫ్ లను పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.