జక్కన్న కొడుకు పెళ్ళిలో ప్రభాస్-అనుష్క ఏం చేశారో తెలుసా?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ, ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తే పూజ ల పెళ్లి కావడంతో గత మూడు రోజులుగా రాజస్థాన్ జైపూర్ లోని హోటల్ ఫేర్ మౌంట్ లో ఒకటే సందడి. ఆదివారం రాత్రి గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్ళిలో బంధు మిత్రులు, టాలీవుడ్ సినీ స్టార్స్,సెలబ్రిటీలు, విచ్చేసారు. టాలీవుడ్ అగ్ర తారలంతా కట్టకట్టుకుని రావడానికి కారణం పెళ్ళికొడుకు,పెళ్లి కూతురు కూడా తెలుగు సినీ రంగానికి చెందిన వ్యక్తుల తాలూకు కావడమే. టాప్ హీరోలతో పాటు సీనియర్ టెక్నీషియన్స్ సైతం ఈ పెళ్లి వేడుకలతో సందడి చేసారు.జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్, అక్కినేని నాగార్జున,ప్రభాస్,అఖిల్, నాని, అనుష్క ఇలా అందరూ ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా ప్రభాస్,అనుష్క ల గురించి చెప్పుకుని తీరాల్సిందే. రెండు రోజుల ముందే జైపూర్ చేరుకున్న ప్రభాస్,అనుష్కలు సంగీత్,మెహందీ,పెళ్లి వేడుక వరకూ కల్సి ఉండడం ఫాన్స్ ని విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. నిజానికి చాలా రిజర్వ్ గా ఉండే ప్రభాస్ సంగీత్ ప్రోగ్రాంలో రాజమౌళితో కల్సి స్టెప్పులేస్తుంటే అనుష్క ఆసక్తిగా చూడ్డమే కాదు,తాను కూడా కాలు కదుపుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీత్, మెహందీ లో కూడా పెళ్ళికి వచ్చిన వాళ్లంతా వీళ్లిద్దరినే చూస్తూ ఉండిపోయారట.
తమ మధ్య ఏమీ లేదంటూనే ఇంత డీప్ గా మూవ్ అవ్వడం అందరినీ అలరించింది. కార్తికేయ పెళ్లి సందర్భంగా పెళ్లికూతురిని ప్రభాస్ పల్లకిలో మోసుకురావడం ప్రత్యేక ఆకర్షణ అయింది. ఎందుకంటే ప్రభాస్ బన్ గలా సూట్ లో ఉంటే, స్వీటీ బ్యూటీ అనుష్క మెరూన్ కలర్ పట్టుచీరలో ప్రభాస్ ని ఫాలో అయింది. ఇక పురోహితుడు మంత్రాలు చదువుతుంటే ప్రభాస్ ,అనుష్కలు పక్కపక్కనే నిల్చొని పెళ్లి తంతును ఆసక్తిగా వీక్షించారు.
ఇక వధూవరులను ఆశీర్వదించడానికి ఇద్దరూ కలిసే వెళ్లి అంక్షింతలు ఒకరికొకరు చేతిలోంచి పంచుకుని మరీ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక నూతన వధూవరులతో ఫోటోలు దిగే సమయంలో కూడా ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారట. పెళ్లి విందులో సైతం ప్రభాస్ ని వెన్నంటే స్వీటీ నడిచింది. అదండీ సంగతి.