Movies

దర్శక దిగ్గజం మృతితో శోకసంద్రంలో సినీ ప్రపంచం

కాలగమనంలో మరో కొత్త సంవత్సరం వచ్చింది. అయితే గడిచిపోయిన 2018లో సినీ పరిశ్రమలో ఎందరో నటులు,కమెడియన్స్,స్టార్స్ కన్నుమూశారు. వీరి మరణం పట్ల సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇక భారతీయ సినీ పరిశ్రమలో దర్శక దిగ్గజం, 95సంవత్సరాల మృణాల్ సేన్ ఇక లేరు. డిసెంబర్ 30న ఆయన కోల్ కత్తాలోని భవాని పూర్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బెంగాలీ చిత్రాలతో దేశంలో ఓ కొత్తశకానికి నాంది పలికిన మృణాల్ 1923 మే 4న బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ లో జన్మించారు. అక్కడే 15 ఏళ్ల పాటు నివసించిన ఈయన ఆ తర్వాత కుటుంబంతో సహా కోల్ కత్తాకు వచ్చి సెటిల్ అయ్యారు. కోల్ కత్తా యూనివర్సిటీ నుంచి పిజి పట్టా అందుకున్నారు.

స్టడీస్ పూర్తయ్యాక సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసిన మృణాల్ తీసిన సినిమాలు సంచలనం సృష్టించాయి. భారతదేశం గర్వించేలా ఎన్నో చిత్రాలు తీసిన ఈయన భారత దేశ ఖ్యాతిని ప్రాజెక్ట్ చేసేవారు.1955లో రాజ్ బోరే మూవీతో డైరెక్టర్ గా ప్రయాణం ప్రారంభించారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్,డాక్యుమెంటరీలు తెరకెక్కించారు. మృగయ, కలకత్తా వంటి ఎన్నో అద్భుత కళా ఖండాలు తీశారు.

2002లో చివరిగా నందితా దాస్ లీడ్ రోల్ గా అమర్ భువన్ మూవీ తీశారు. భువన్ షో లో అమితాబ్ డబ్బింగ్ కెరీర్ స్టార్ చేసారు. తెలుగులో ఒక ఊరి కథ సినిమా తీసారు. దర్శకుడిగానే కాదు ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్, అవార్డు కమిటీలకు జ్యురిగా వ్యవహరించారు.
ఈయన మరణం పట్ల నందిత దాస్,అమితాబ్ వంటి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. సోమవారం అన్యక్రియలు జరిగాయి.