Movies

రాజమౌళి కొడుకు పెళ్ళికి ఎంత ఖర్చు చేసాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

గొప్పింటి పెళ్లి ఎలా ఉంటుందో ఈ మధ్య అంబానీ ఇంట్లో పెళ్లి మరోసారి నిరూపిస్తే,తాజాగా, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల పెళ్లి కూడా ఔరా అనిపించక మానదు. మూడు రోజులపాటు సాగిన ఈ పెళ్లి సందడి ఆదివారం రాత్రి జైపూర్ లోని హోటల్ ఫేర్ మౌంట్ లో గ్రాండ్ గా జరిగిన పెళ్లి తంతుతో ఘనంగా ముగిసింది. పూజ ఎవరంటే, ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తే. ఆమె గాయనిగా గుర్తింపు పొందారు. వీకెండ్ లో అరేంజ్ చేసిన ఈ పెళ్ళికి బంధు మిత్రులు, సినీ స్టార్స్,సెలబ్రిటీలు తరలివచ్చారు. రెండు, మూడు రోజుల ముందే టాలీవుడ్ సెలబ్రిటీలు విచ్చేయగా,బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ పెళ్లి వేడుకకు తరలి వచ్చారు.

కళ్ళు చెదిరే ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ పెళ్లి ఏర్పాట్లకు రాజమౌళి దాదాపు 300కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా జక్కన్న పక్కా ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చిన అతిధులకు ఎక్కడా మర్యాదకు లోటు లేకుండా చూసుకున్నారు. పైగా జైపూర్ లో టాప్ హోటల్ గా పేరొందిన ఫేర్ మౌంట్ హోటల్ లో రాజమౌళి,రమా రాజమౌళి చేసిన ఏర్పాట్లు అతిధులకు ఫిదా అయ్యారు.

బాహుబలి కింగ్ డమ్ సెట్టింగ్ కోసం ఖర్చు భారీగానే పెట్టారట. హోటల్ ని దాదాపు వారం రోజులపాటు రాజమౌళి కిందే ఉంచేసుకున్నారు. రూమ్స్,కాన్ఫరెన్స్ హాలు,బాంకెట్, డైనింగ్ హాలు అన్నింటినీ బుక్ చేసి పారేసారు. ఎయిర్ పోర్టు నుంచి రావడానికి వీలుగా లగ్జరీ కార్లు ఏర్పాటుచేయడంతో పాటు, రూమ్స్ లో ఒక్కో అతిథికి ఒక్కొక్క అసిస్టెంట్ ని నియమించారు. మూడు రోజులపాటు అతిధులు ఏమి కోరితే అది అరేంజ్ చేసారు రాజమౌళి కుటుంబం.

సంగీత్, మెహందీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. పెళ్ళికి వచ్చిన సెలబ్రిటీలు తమ పనులు, తమను తాము మర్చిపోయేలా రాజమౌళి ఏర్పాట్లు చేసారు. డిసెంబర్ 28న ప్రీ వెడ్డింగ్ పార్టీ,29న సంగీత్ కార్యక్రమం ఏర్పాటుచేసి టాలీవుడ్ స్టార్స్ ని ఉల్లాసంతో తెలియాడించాడు రాజమౌళి. అక్కినేని నాగార్జున,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,రానా, నాని, అనుష్క వంటి స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

ఇక దేశంలోని ప్రముఖ రాజస్థానీ చెఫ్ లను ఒక్క చోటకు చేర్చి దాల్ బటీ చుర్మా, లాల్ మాస్, కేర్ సాంగ్రి, దిల్ కుషాల్,గట్టెకి కిచిడి, బుందో రైటా, రాజస్థానీ కడీ, గట్టెకి పలావ్,లడ్డు,బాదం హల్వా,ఆమ్ కి లాంజీ, మేతి బజరా పూరి,ప్యాజ్ కచోరి, గీవార్ వంటి రాజస్థాన్ వంటకాలను అలాగే వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్స్ అన్నింటిని అతిధులకు అందించడం విశేషం. ఎప్పుడూ రుచి చూడని వంటకాలేమో అందరూ అబ్బురపడ్డారు. కొన్ని నెలల ముందే మెనూ బుక్ చేశారట. పక్కా రాజస్థానీ వంటకాలు కావడంతో అతిధులు రుచులను ఆస్వాదించారు.