Movies

రాజమౌళి కొడుకు పెళ్ళికి రాజకీయ ప్రముఖులు ఎందుకు రాలేదంటే….

సెలబ్రిటీల ఇంట్లో పెళ్లంటే కోట్ల రూపాయలు కుమ్మరించడమే. ఆకాశమంత పందిరి,భూదేవి అంత అరుగు వేసి ఒకరిని మించి మరొకరు గ్రాండ్ గా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ముఖ్యంగా తాము ఉండే ప్రదేశాలను వదిలేసి,విదేశాల్లోనే,పర్యాటక ప్రాంతాల్లోనో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. అది బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇక తాజాగా, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల పెళ్లి కూడా అదే రేంజ్ లో సాగింది. తన సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో కొడుకు పెళ్లి కూడా అదేరీతిలో జరిపించాడు రాజమౌళి. రాజస్థాన్ లోని జైపూర్ పర్యాటకానికి పెట్టింది పేరు. అలాంటి చోట భారీ ఎత్తున ఫేర్ మౌంట్ హోటల్ లో హోటల్ లో సెట్ కూడా వేసి పెళ్లి చేయించాడు.

ఆదివారం రాత్రి జైపూర్ లోని హోటల్ ఫేర్ మౌంట్ లో గ్రాండ్ గా జరిగిన పెళ్లికి బంధు మిత్రులు, సినీ స్టార్స్,సెలబ్రిటీలు హాజరయ్యారు. కళ్ళు చెదిరే బాహుబలి సెటింగ్స్ మధ్య జరిగిన ఈ పెళ్లి కి ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా జక్కన్న పక్కా ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చిన అతిధులకు ఎక్కడా మర్యాదకు లోటు లేకుండా చేసారు. అక్కినేని నాగార్జున,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,రానా, నాని, అనుష్క వంటి స్టార్స్ కార్తికేయ పెళ్ళిలో జిగేల్ మనిపించారు.

బాలీవుడ్ నటులు కూడా వచ్చారు. అయితే ఒక్కరంటే ఒక్క రాజకీయ ప్రముఖుడు కానరాలేదు. తెలంగాణా లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన టిఆర్ ఎస్ వాళ్ళను పిలిస్తే మిగతావాళ్ళు రారేమోనని మొత్తం పొలిటికల్ లిస్ట్ ని డిలీట్ చేసాడని చెప్పవచ్చు. నిజానికి ఎపి,తెలంగాణా స్టేట్స్ లో చాలామంది పొలిటీషియన్స్ తో రాజమౌళికి సంబంధాలున్నాయి. అయితే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో, రాజకీయ నేతలకు ఎంత దూరం ఉండాలో వంటి విషయాలు తెలిసిన రాజమౌళి ఇక తన కొడుకు పెళ్ళికి ఒకర్ని పిలిచి మరొకర్ని పిలవకపోతే బాగోదని బాగా తెల్సిన రాజమౌళి ఇక ఆ రంగం జోలికి వెళ్ళలేదు.

ఎవరిని పిలవకపోయినా ఫలానా పార్టీ వాళ్ళని ముద్ర వేస్తారన్న ఉద్దేశ్యంతో అసలు అటువైపు అడుగులు వేయలేదని చెప్పాలి. ఎపి రాజధాని భవనాల కోసం రాజమౌళిని చంద్రబాబు లండన్ కూడా పంపాడు. దీంతో చంద్రబాబుకి దగ్గరనే ముద్ర కూడా పడింది. ఇక రాజమౌళి డిజైన్స్ ని కూడా చంద్రబాబు పక్కన పెట్టేయడంతో ఇద్దరి మధ్యా పెద్దగా సాన్నిహిత్యం కూడా లేదని తేలింది. మొత్తానికి ఎవరినీ పిలవకుండా రాజమౌళి పొలిటీషియన్స్ పట్ల దూరం పాటించాడు.