Movies

ఎన్ని ప్లాప్స్ వచ్చిన ఛార్మిని వదలని పూరి…ఎందుకో తెలుసా?

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌ను ఇచ్చిన విషయం తెల్సిందే. తక్కువ బడ్జెట్‌తో చాలా వేగంగా భారీ హిట్ సినిమాలను తెరకెక్కించి టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా తెచ్చుకున్నాడు. అయితే గత ఐదు సంవత్సరాల నుండి ప్లాప్స్ తోనే కాలం గడుపుతున్నాడు. మినిమం గ్యారెంటీ దర్శకుడు కాస్త ప్లాప్‌ చిత్రాల దర్శకుడిగా ముద్ర పడిపోయాడు.ఈ మధ్య కాలంలో పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అయ్యాయి. ఈ మధ్య కాలంలో పూరి ప్రతి సినిమాలోనూ ఛార్మి ఇన్వాల్వ్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుంది.

పూరి కాన్సెర్ట్‌ అంటూ ఏర్పాటు చేసిన బ్యానర్ బాధ్యతలు కూడా ఛార్మికి అప్పగించాడు పూరి. దీనికి సంబంధించి అన్ని విషయాలను ఛార్మి చూసుకుంటుంది. ఆమద్య పూరి కొడుకు ఆకాష్ హీరోగా వచ్చిన మెహబూబా సినిమాను అంతా తానై నడిపించింది. కథ స్క్రీన్‌ప్లే విషయంలో కూడా ఛార్మి ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాల విషయంలో ఆమె ఇన్వాల్వ్‌మెంట్‌ వల్లే సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా ఫ్లాప్‌లు వచ్చినా కూడా ఆమెను మాత్రం వదలడం లేదు. మెహబూబా సినిమాను సొంతంగా నిర్మించిన పూరి ఆ సినిమా ఫ్లాప్‌తో తన ఇంటిని ఇతర ఆస్తులను కూడా అమ్మేసినట్లుగా తెలుస్తోంది.

తాజాగా రామ్‌తో సినిమాకు సిద్దం అవుతున్న పూరితో ఛార్మి ఉంది. తాజాగా తీసుకున్న ఒక ఫొటోలో రామ్‌, పూరితో పాటు ఛార్మి కూడా ఉంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె వేలు ఉంటుందని సోషల్‌ టాక్‌ వినిపిస్తుంది. ఇలా ఆమె ఇన్వాల్వ్‌మెంట్‌ వల్ల సినిమా ఫ్లాప్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు విమర్శలు చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."