Movies

న్యూ ఇయర్ రోజు యాంకర్ ప్రదీప్ సంచలన నిర్ణయం… వర్క్ అవుట్ అవుతుందా?

ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటారు కదా. ఒకప్పుడు సినీ ఛాన్స్ లు తగ్గితే బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చి,నిలదొక్కుకునే వారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బుల్లితెరమీద తమ సత్తా చాటుకుని,వెండితెరమీద ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే జబర్ దస్త్ కమెడియన్స్,బిగ్ బాస్ షో లో చేసిన వాళ్ళు బిగ్ స్క్రీన్ పై ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. ఇలా రెండు రంగాల్లో తమ హవా సాగిస్తున్నారు. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కూడా వెండితెరపై హీరోగా రాబోతోన్నాడట.

ఇప్పటికే సినిమాల్లో ఆయా పాత్రల్లో నటిస్తున్న ప్రదీప్ అత్తారింటికి దారేది చిత్రంలో వేసిన పాత్ర బాగానే ఆకట్టుకుంది. అయితే కేరక్టర్ రోల్స్ కే సినిమాల్లోపరిమితం అవుతూ వస్తున్న ప్రదీప్ టివి యాంకర్ గా స్టార్ హోదా తెచ్చుకున్నాడు. సుమ,ఝాన్సీ వంటి ఫీమేల్ యాంకర్స్ ఎలా పేరు తెచ్చుకున్నారో మేల్ యాంకర్ గా ప్రదీప్ సమయ స్పూర్తితో,హాస్యం పండిస్తూ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. టివి యాంకర్ గా యితడు తీసుకునే రెమ్యునరేషన్ కొందరు నటులను మించి ఉంటుందని చెప్పవచ్చు.

సినిమా ఫంక్షన్స్ కి కూడా యాంకర్ గా వ్యవహరించే ప్రదీప్ ఇప్పుడు ఏకంగా హీరో గా వస్తున్నాడట. హీరోగానే వేయాలని న్యూ ఇయర్ లో నిర్ణయం తీసుకున్నాడట. కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మణికణ్ణన్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ లో కమిట్ అయ్యాడు. హాస్యంతో పాటు,ఫామిలీ సింటిమెంట్ జోడించి ప్రదీప్ కి తగ్గ కథ రూపొందించి వినిపించడంతో ఒకే అయిందని అంటున్నారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్ప్పటికే స్టార్ట్ అయ్యాయి. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తరహా చిత్రంగా ఉండే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి నుంచి జరుగుతుందని భావిస్తున్నారట. త్వరలోనే అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."