Movies

ఎవరు ఊహించని పాత్రలో నటిస్తున్న కాజల్ … కాజల్ దశ తిరుగుతుందా?

విలన్ గా వేస్తూ హీరోలు అయిన వాళ్ళు చాలామంది వున్నారు. ఇక హీరోలుగా ఛాన్స్ లు తగ్గి విలన్స్ గా రాణిస్తున్నవాళ్లూ ఉన్నారు. అయితే హీరోయిన్ గా రాణిస్తూ ఐటెం సాంగ్ లో వేసేవాళ్ళే కాదు,విలన్ పాత్రకు సైతం సై అంటున్న హీరోయిన్స్ కూడా ఈమధ్య ఉంటున్నారు. ఇక తాజాగా మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విలన్ గా చేస్తోందట. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోందట.

దర్శకుడు తేజ డైరెక్షన్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీను హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సీత అనే యాంటీ రోల్ కేరక్టర్ లో కాజల్ నటిస్తోందని అంటున్నారు. గ్లామర్ గా ఉండే కాజల్ విలన్ గా కనిపించాలంటే అందుకు తగ్గ మేకప్ సిద్ధం చేశారట. పెద్ద బొట్టు,గడ్డం దగ్గర గాయం ఆనవాళ్లతో కొంచెం భయంకరంగానే కనిపించబోతోందట.

ఇప్పటికే కాజల్ నటించిన క్వీన్ రీమేక్ సినిమా పారిస్ పారిస్ విడుదలకు సిద్ధం అయింది. అలాగే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు – 2మూవీలో కూడా కాజల్ నటిస్తోంది. గతంలో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన కవచం సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడు చేసే తాజా సినిమాలో విలన్ గా నటించి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.