Movies

ఆనాటి స్టార్ హీరోయిన్ గౌతమి మేనకోడలు టాప్ హీరోయిన్, చోటా భీమ్ సృష్టి కర్త ఎవరో తెలుసా?

టివి చానల్స్ వచ్చాక అందులో రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు అసలు కదలకుండా చూసే ఎన్నో షోస్ వస్తున్నాయి. కార్టూన్ షోస్ ని అసలు వదలకుండా పిల్లలు చూడడం వలన టిఆర్పి రేటింగ్ కూడా బానే వస్తోంది. ఇక పిల్లలు బాగా ఎడిట్ అయిపోయిన షోస్ లో కీలకమైన షో ఏంటంటే , చోటా భీమ్ అని చెప్పేస్తారు. అంతగా చోటా భీమ్ షో రాణిస్తోంది. ఎక్కడ చూసినా చోటా భీమ్ బొమ్మలే దర్శనం కూడా ఇస్తున్నాయి. ఇంతగా పాపులర్ అయినా చోటా భీమ్ క్రియేటర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, చోటా భీమ్ సృష్టి కర్త స్క్రిప్ట్ రైటర్ మన తెలుగు హీరోయిన్ అని చెబితే నిజంగా ఖంగు తింటారు. కానీ నిజమే. ఆమె పేరు సౌమ్య బొల్లాప్రగడ.

సౌమ్య స్వచ్ఛమైన తెలుగు అమ్మాయే. జర్నలిజం లో డిగ్రీ చేసింది. మంచి హైట్ ,పర్సనాలిటీ గల ఈమె వైజాగ్ ఆంద్ర యూనివర్సిటీలో సైకాలజీ చేసేటప్పుడు మిస్ సౌత్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొని మిస్ పర్సనాలిటీ అవార్డుని సొంతం చేసుకుంది. ఈమె తండ్రి దివాకర్ మెరైన్ ఇంజనీర్. తల్లి గృహిణి. ఇక సౌమ్య తమ్ముడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

ఇక సౌమ్య కాలేజీ డేస్ లో మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. మిస్ యూనివర్స్ గా గెలిచిన సుస్మితా సేన్ కి ట్రైనింగ్ ఇచ్చిన కౌశిక్ దగ్గర శిక్షణ తీసుకున్న సౌమ్య ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో చేసింది. ఇంగ్లీషు మాసపత్రిక నడిపింది. మోడల్ గా, రైటర్ గా ,రచయిత్రిగా కూడా రాణించి, 14ఏళ్ళ వయసులోనే ఇంటర్నేషనల్ పొయిట్రీ కాంపిటేషన్ లో అవార్డు సొంతం చేసుకుంది.

ద హాంగ్రేజి అనే ఉర్దూ మూవీ తో తెరపై ఎంట్రీ ఇచ్చిన సౌమ్య ఆతర్వాత ఇంగ్లీషు మూవీలో నటించాక, అప్పుడు తెలుగులో ఛాన్స్ వచ్చింది. ఆరోజే మూవీ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుని,నిన్న-నేడు – రేపు, కాల్ సెంటర్, యంగ్ ఇండియా, ముగ్గురు, రామదండు,చందమామ కథలు వంటి సినిమాల్లో హీరోయిన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అదే సమయంలో జెమిని టివిలో జాలీవుడ్ ఎక్స్ ప్రెస్ అనే షో యాంకర్ గా చేసింది. ఇక ఈమె మేనత్త తెలుగు, తమిళ,హిందీ,కన్నడ,మళయాళ రంగాలను ఓ ఊపేసిన ఆనాటి స్టార్ హీరోయిన్ గౌతమి అయితే ఎక్కడా బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించకుండా సొంత టాలెంట్ తో 15ఏళ్లపాటు తెలుగు ఇండస్ట్రీలో దూసు కెళ్ళింది. దీనికి కారణం ఈమె టాలెంట్.