Movies

ప్రభాస్ సాహు లో కీలక సన్నివేశం ఇదే…సినిమాకే హైలెట్

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం సాహు. ఈ మూవీకి సుజిత్ డైరెక్షన్ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ మూవీ తీస్తున్నారట. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. శంకర్ ఎస్ ఆన్ లై సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ ముఖేష్,అరుణ్ విజయ్ కీలకమైన రోల్స్ వేస్తున్నారు. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన మేకింగ్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలు గల ఈ మూవీలో ఓ కీలక సన్నివేశం హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
Sahoo Prabhas
నిజమో కాదో కానీ ఒకటి రెండు సోషల్ మీడియా ఛానల్స్ లో వచ్చిన కథనాలపై ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ దొంగతనం చేసే సీన్ ఉందట. ఓ బంగారం దుకాణంలో దొంగతనం చేయడానికి ప్రభాస్ భారీ స్కెచ్ వేయడం, అది అమల్లో పెట్టి నగలు కొట్టేయడం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సీన్ లో హీరోయినా శ్రద్ధా కపూర్ కూడా ఉంటుందట. ఇక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కూడా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శ్రద్ధ తో వర్క్ చేస్తున్నాడట.

కాగా దాదాపు 200కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూరప్ లో కొన్ని సీన్స్ తీయాలని అనుకున్నా, ఫిలిం సిటీలో సెట్ వేసి చేసేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని 2019ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. దేశవిదేశాల్లో చిత్రిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ ,హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."