Movies

రామానాయుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా….నమ్మలేని నిజాలు

1) భారతీయ భాషలన్నిట్లో సినిమాలను నిర్మించి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న మన మూవీ మొగల్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం అనేది తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయం.

2) రామానాయుడు గారు అప్పటి గుంటూర్ ఇప్పటి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎన్నో సినిమాలు చేయాలన్న కృషితో, పట్టుదలతో సినీలోకానికి పరిచయమయ్యారు.

3) రామానాయుడు మొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన “నమ్మిన బంటు” సినిమా లో నటించారు. ఈ సినిమాలో హుషారుగా కనిపించిన రామానాయుడుని మన ఏఎన్నార్ పూర్తి స్థాయిలో సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. కానీ ఆ సమయంలో రామానాయుడు అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు.

4) తరువాత చెన్నై వెళ్ళిన రామానాయుడు “అనురాగం” సినిమా నిర్మాతలలో భాగస్వామి అయ్యారు. నిర్మాణ రంగంలో గొప్ప మెళకువలు తెలుసుకున్న రామానాయుడ్ని ఆయన పట్టుదల, శ్రమ ఉన్నత శిఖరాలు అందుకునేలా చేసాయి.

5) రామానాయుడు నిర్మాతనే కాదు గొప్ప నటుడు కూడా తనకు నచ్చిన పాత్రలలో 10 సినిమాలలో నటించారు. స్వంతగా “సురేష్ ప్రొడక్షన్స్”ను ప్రారంభించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన 1964 లో విడుదలైన “రాముడు భీముడు” సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.

6) ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అనుహ్యమైన స్పందన లభించింది. కానీ తరువాత రిలీజ్ అయిన “శ్రీ కృష్ణ తులాభారం”, “ద్రోహి” వంటి సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. అయినప్పటికి ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఏఎన్నార్ మరియు వాణిశ్రీ నటించిన “ప్రేమనగర్” సినిమాకి నిర్మాతగా వ్యవహరించి పెద్ద హిట్ సొంతం చేసుకున్నారు.

7) ఈ సినిమాతో పుర్తిగా నిర్మాణ రంగంలో స్థిరపడి “జీవనతరంగాలు”, “సెక్రటరి”, “సొగ్గాడు”, “అహనా పెళ్ళంట” .. వంటి వరుస విజయాలు అందుకున్నారు.

8) ఇలా ఒక్కరు కాదు.. కృష్ణ, క్రిష్ణం రాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల సినిమాలను నిర్మించారు. అలాగే రవితేజ, శ్రీకాంత్, అల్లరి నరేష్, తరుణ్, నిఖిల్ లాంటి ఇప్పటితరం హీరోలతో కూడా సినిమాలు తీశారు. మొత్తంగా అన్ని భారతీయ భాషలలో 150 పైగా సినిమాలు నిర్మించడం అంటే మామూలు విషయం కాదు.

9) కష్టపడి పనిచేసే తత్వం, క్రమశిక్షణ, అంకిత భావం ఇవ్వన్నీ కలిపితే డాక్టర్ పద్మభూషన్ దగ్గుబాటి రామానాయుడు. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ నలువైపులా వ్యాపింపచేసిన నిర్మాణ సంస్థ అంటే “సురేష్ ప్రొడక్షన్స్” అని చెప్పుకోవాలి.

10) చివరి దశలో క్యాన్సర్ వ్యాధితో రామానాయుడు గారు ఫిబ్రవరి 18, 2015 న హైదరాబాద్ లో కనుమూశారు.

11) ఈ సంస్థ నుండి ఎంతోమంది నటీనటులు, దర్శకులు వెండి తెరకు పరిచయమై వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుని గొప్ప స్టార్స్ గా చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

12) ఇంకా మంచి సినిమాలు చిత్ర పరిశ్రమకు అందివ్వాలనే లక్ష్యంతో తండ్రి బాటలోనే కుమారుడు సురేష్ కూడా నిర్మణ రంగం వైపు అడుగులు వేసి అదే బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు.

13) రామానాయుడు రెండవ కుమారుడు వెంకటేష్ “విక్టరి”ని తన ఇంటి పేరుగా మలచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోల జాబితాలో ఒకరిగా నిలిచారు.

14) తాత పేరును తన పేరుగా నామకరణం చేసుకుని ఇటు తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఒక “లీడర్” గా దూసుకుపోతున్న”భల్లాలదేవ” రామానాయుడు గారి మనవడు, సురేష్ గారి కుమారుడు “రానా దగ్గుబాటి”.