Movies

వెంకీ అల్లుడు ఎవరి కొడుకో తెలుసా? ఎవరికి తెలియని నిజాలు

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అందుకే అన్నారు. ఇక సినిమా వాళ్ళ మధ్య ప్రేమలు పెళ్లిళ్లు కూడా అదేవిధంగా ఉంటాయి. చాలామంది ప్రేమపెళ్లిళ్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా తన కూతురు ప్రేమను అర్ధం చేసుకుని ఆమెకు నచ్చిన వాడితో పెళ్లి జరిపించాడు. ఇండస్ట్రీలో వెంకటేష్ కి ఓ ఇమేజ్ వుంది. ఇక వెంకీ కూతురు అశ్రీత పెళ్లి చేసుకున్న వినాయక్ రెడ్డి తాతగారు కూడా వ్యాపార రంగంలో పెద్ద పేరున్న వ్యక్తి.

హైదరాబాద్ రేస్ క్లబ్ కి మంచి గుర్తింపు తెచ్చిన ఆర్ సురేంద్ర రెడ్డి మనవడే వినాయక్ రెడ్డి. రేస్ క్లబ్ కి ఎక్కువకాలం చైర్మన్ గా వ్యవహరించి రికార్డ్ సృష్టించిన సురేంద్ర రెడ్డి అంటే హార్స్ రేస్ లో పాల్గొనే ప్రతిఒక్కరికీ తెలిసిన వ్యక్తే. ఈయన తొలిసారి రేస్ క్లబ్ కి ఎన్నికయ్యే సరికి సాధారణ క్లబ్ గా ఉండేది. అయితే పూర్తిగా శ్రద్ధ పెట్టి రేస్ క్లబ్ కి పేరు తేవడమే కాదు నష్టాల్లో గల క్లబ్ ని 700కోట్ల టర్నోవర్ క్లబ్ గా మార్చేశారు.

ఇక వెంకటేష్ తన ఫామిలీ గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఫామిలీ గురించి బయట ఏమీ చెప్పడు. అయితే అల్లుడు కూడా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడట. కాగా సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి ఫారిన్ లో చదివాడు. అక్కడ స్టడీస్ సమయంలోనే వెంకీ కూతురితో లవ్ లో పడ్డాడు. ఇక చిన్నతనంలో కూడా ఇద్దరూ ఒకేచోట చదువుకున్నారట. అందుకే ఇద్దరి మధ్యా ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ గా మారింది. ఇద్దరు ఇళ్లల్లో విషయం చెప్పి తమ ప్రేమను పెళ్లిగా మలచుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."